E-Paper
Advertisement

JP Nadda : కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించండి.. తెలంగాణ ప్రజలకు నడ్డా పిలుపు..

JP Nadda : కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించండి.. తెలంగాణ ప్రజలకు నడ్డా పిలుపు..
Advertisement

JP Nadda : తెలంగాణలో ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ బీజేపీ కూడా ఎన్నికల ప్రచారం ఉద్ధృతం చేసింది. బీసీ సీఎం నినాదంతో ఎన్నికల రణక్షేత్రంలోకి దిగింది కాషాయ దళం. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి బహిరంగ సభల్లో పాల్గొని క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రంగంలోకి దిగారు.

నిజామాబాద్‌లో నిర్వహించిన సకల జనుల సంకల్ప సభకు హాజరైన నడ్డా.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణ రూపురేఖలు మారిపోతాయన్నారు. బీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన ఈ పదేళ్లలో కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రమే బాగుపడిందన్నారు.

Advertisement

తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్‌ మోసం చేశారని నడ్డా విమర్శించారు. దళిత బంధులో ప్రజాప్రతినిధులు 30 శాతం కమీషన్‌ తీసుకున్నారని ఆరోపించారు. అందుకే కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామని ప్రజలకు పిలుపునిచ్చారు.

పీఎం ఫసల్‌ బీమా యోజనను తెలంగాణలో అమలు చేయడం లేదని నడ్డా ఆరోపించారు. ప్రధాని మోదీ హయాంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఐదో స్థానానికి చేరిందన్నారు. గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ పంపిణీ చేస్తున్నామన్నారు. దేశంలో పలు రాష్ట్రాలకు కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించామని.. అలాగే తెలంగాణలో మార్పురావాలని నడ్డా పిలుపునిచ్చారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×