BigTV English

Rashmika Mandanna: ఎన్నిసార్లు ఆ ఇంట్లోనే అడ్డంగా దొరికిపోతావ్ రష్మిక..

Rashmika Mandanna: ఎన్నిసార్లు ఆ ఇంట్లోనే అడ్డంగా దొరికిపోతావ్ రష్మిక..

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.  కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన ఈ చిన్నది.. మొదటి సినిమా హీరోనే అయిన రక్షిత్ శెట్టి ప్రేమలో పడి  ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. ఆ సమయంలోనే తెలుగులో కూడా ఛలో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే  మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా వరుస అవకాశాలను  అందుకుంది.


ఛలో తరువాత గీతా గోవిందం సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక వరుస అవకాశాలు  వస్తున్నాయి.. ఈ సమయంలో పెళ్లి ఎందుకు అనుకున్నదో.. లేక అప్పటికే గీత గోవిందంలో నటించిన విజయ్ దేవరకొండతో ప్రేమలో పడిందో తెలియదు కానీ.. రక్షిత్ శెట్టితో జరిగిన ఎంగేజ్ మెంట్ ను క్యాన్సిల్ చేసుకుంది. అప్పటి నుంచి సింగిల్  గానే ఉంటున్నాను అని ఈ చిన్నది చెప్తున్నా.. విజయ్ ప్రేమలో ఉంటుంది అనేది మాత్రం  ఇండస్ట్రీ  మొత్తానికి అర్థమైపోయింది.

Bagheera Day 1 Collections : “బఘీర” ఫస్ట్ డే కలెక్షన్స్… కన్నడ సూపర్ హీరోకు ఆదరణ ఎలా ఉందంటే?


ఎన్నోసార్లు ఈ జంట కెమెరా కంటికి అడ్డంగా దొరికిపోయారు. ఇంకెన్నోసార్లు వారిద్దరూ కలిసే ఉన్నట్లు ఫ్యాన్స్ కనిపెట్టేశారు. ఒకే వెకేషన్ కు వెళ్లి.. ఫొటోస్ విడివిడిగా పెట్టేసినా..  రష్మిక వెనుక ఉన్న వ్యక్తి ఫేస్ కనిపించకపోయినా .. వాయిస్ ద్వారా అక్కడ ఉన్నది విజయ్ అని ఇట్టే కనిపెట్టేస్తారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. పండగ వచ్చింది అంటే  చాలు రష్మిక.. దేవరకొండ ఇంట్లోనే మకాం పెట్టేస్తుంది. ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఎన్నోసార్లు ఇలానే ఆమె  విజయ్ ఇంట్లో అడ్డంగా దొరికిపోయింది.

ఈసారి కూడా దీవాళీ పండగను రష్మిక.. విజయ్ కుటుంబంతో కలిసి చేసుకుంది.  వైట్ కలర్ డిజైనర్ డ్రెస్ లో చేతిలో దివ్వెలను పట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది. దీవాళీ ఫోటోషూట్ అయిపోయింది.. హ్యాపీ దీవాళీ మై  లవ్లీస్  అంటూ రాసుకొచ్చింది. ఈ డ్రెస్ లో ఆమె ఎంత సింపుల్ గా ఉందో.. అంతే అందంగా కూడా కనిపించింది. ఇక ఆమె అందంతో పాటు ఫ్యాన్స్.. ఆమె ఉన్న బ్యాక్ గ్రౌండ్ ను కూడా చెక్ చేసి .. అది విజయ్ దేవరకొండ ఇల్లునే అని కన్ఫర్మ్ చేశారు.

Amaran Day 1 Collections: “అమరన్” ఫస్ట్ డే కలెక్షన్స్… రికార్డుల ఊచకోత

కన్ఫర్మ్ మాత్రమే కాదు.. గతంలో ఆ ప్లేస్ లో విజయ్ దిగిన ఫోటోను కూడా షేర్ చేస్తూ.. ఈసారి కూడా రష్మిక అడ్డంగా దొరికిపోయింది అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ముందు రష్మికనే ఈ ఫోటోలు తీసింది ఆనంద్ దేవరకొండనే తీసాడని క్యాప్షన్ పెట్టింది.. కొద్దిసేపటికే ఆనంద్ పేరును డిలీట్ చేసింది.  ఇక దీంతో .. ఇలా దాగుడుమూతలు ఆడే బదులు ప్రేమలో ఉన్నట్లు చెప్తే ఫ్యాన్స్ కూడా సంతోషిస్తారు కదా అని కామెంట్స్  పెడుతున్నారు. ఈ మధ్యనే రష్మిక – విజయ్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాను హీట్ ఎక్కించిన విషయం తెల్సిందే. కానీ, అందులో నిజం లేదని విజయ్ చెప్పడంతో వీటికి ఫుల్ స్టాప్ పడింది. ఇక ఇప్పుడు ఈ ఫోటోషూట్ వలన మరోసారి వీరి ప్రేమాయణం బయటపడింది. మరి ఈ జంట త్వరలోనే శుభవార్తను  చెప్తారేమో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×