BigTV English

Bagheera Day 1 Collections : “బఘీర” ఫస్ట్ డే కలెక్షన్స్… కన్నడ సూపర్ హీరోకు ఆదరణ ఎలా ఉందంటే?

Bagheera Day 1 Collections : “బఘీర” ఫస్ట్ డే కలెక్షన్స్… కన్నడ సూపర్ హీరోకు ఆదరణ ఎలా ఉందంటే?

Bagheera Day 1 Collections : దీపావళి కానుకగా తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో వచ్చిన సినిమాలలో ‘బఘీరా’ (Bagheera) కూడా ఒకటి. ఈ కన్నడ సూపర్ హీరో మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం పదండి…


కేజిఎఫ్, కాంతారా లాంటి సినిమాలతో హోంబలే ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ సౌత్ లోనే బిగ్గెస్ట్ బ్యానర్ గా అవతరించింది. ఇప్పుడు ఇదే బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరంగదూర్ నిర్మించిన తాజా సూపర్ హీరో మూవీ ‘బఘీరా’ (Bagheera) . ఈ సినిమాలో కన్నడ స్టార్ శ్రీ మురళి (Sri Murali) హీరోగా నటించగా, రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా కన్పించింది. డిఆర్ సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథను అందించడంతో సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వచ్చాయి? ఈ సూపర్ హీరో మూవీకి ఎంతవరకు ప్రేక్షకాదరణ దక్కుతోంది? అనే విషయాలను ఆరా తీస్తున్నారు మూవీ లవర్స్.

దాదాపు 20 కోట్ల భారీ బడ్జెట్ తో కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ Bagheera సినిమాను నిర్మించారు హోంబలే నిర్మాతలు. కన్నడలో స్వయంగా హోంబలే బ్యానర్ ఈ సినిమాను రిలీజ్ చేయగా, తెలంగాణ, ఏపీ, మలయాళ, కన్నడ భాషలలో ఈ సినిమాను కమిషన్ బేస్ మీద డిస్ట్రిబ్యూట్ చేశారని తెలుస్తోంది. మొత్తానికి కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ కాగా, ప్రపంచవ్యాప్తంగా సుమారు 1000 స్క్రీన్ లలో రిలీజ్ అయింది.


ఇక ప్రశాంత్ వర్మ (Prashanth Varma) భాగమైన ఈ సినిమాకు కన్నడ బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్ట్రాంగ్ గానే జరిగాయి. కన్నడలో ఈ మూవీ మొదటి రోజు 5 కోట్ల గ్రాస్, ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల గ్రాస్, 4 కోట్ల షేర్ వసూలను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ సినిమా ఇండియాలో మొదటి రోజు 2 కోట్ల 80 లక్షల నెట్ కలెక్షన్స్ కొల్లగొట్టినట్టుగా తెలుస్తోంది. కన్నడ, తెలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీకి ఏరియా వైజ్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి ? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

‘బఘీరా’ (Bagheera) మూవీ బ్రేక్ ఈవెన్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా సుమారుగా 22 కోట్ల షేర్, 44 కోట్ల గ్రాస్ వసూళ్ళను రాబట్టాల్సి ఉంది. అయితే ఈ మూవీకి దీపావళి సందర్భంగా వచ్చిన లాంగ్ వీకెండ్ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ‘బఘీరా’ మూవీ ఈ అద్భుతమైన ఛాన్స్ ను ఏ రకంగా ఉపయోగించుకుంటుంది అనేది చూడాలి.

వేదాంగ్ అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సూపర్ హీరోగా మారడం, ధర్మాన్ని పక్కన పెట్టి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అక్రమార్కులపై ఉక్కు పాదం మోపితే ఎలా ఉంటుంది ? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో తెరకెక్కించారు ఈ సినిమాను. సినిమాలో కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×