Akkineni Nagarjuna’s Kubera Movie first Look Glimpse Released: టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఈ ఏడాది ‘నా సామిరంగ’ సినిమాతో వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నాడు. ఇందులో నాగ్ స్టైల్, మాస్ లుక్ ప్రేక్షకాభిమానులకు బాగా నచ్చేసింది. ఇక ఈ మూవీ తర్వాత కింగ్ నాగ్ ఇప్పుడు మరో మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నాడు. ఆ మూవీ పేరు ‘కుబేర’. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది.
ఈ మూవీలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ధనుష్, నాగార్జున కలయికలో వస్తున్న ఫస్ట్ మూవీ ఇదే కాబట్టి దీనిపై ప్రేక్షకాభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, ధనుష్ ఫస్ట్‌లుక్ టీజర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించాయి.ముఖ్యంగా టైటిల్‌కు ఆ టీజర్‌లో చూపించిన ధనుష్ లుక్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే సినిమా పేరు కుబేర అని పెట్టి.. అందులో ధనుష్‌ను ఒక బిచ్చగాడిలా చూపించారు. అందువల్ల దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ మూవీని గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని అందరికీ అర్థమైపోయింది.
ఒక బిచ్చగాడిలా ఉండే ఓ వ్యక్తి కుబేరుడిగా ఎలా మారాడు అనేలా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ టీజర్ చూస్తే అర్థమవుతుంది. దీంతో ఈ మూవీపై అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్‌ను మేకర్స్ వదిలారు. ఇందులో భాగంగా నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు.అందులో మొదటిగా రూ.500 కట్లతో డబ్బులు పోగేసి ఉన్నాయి. ఆ డబ్బులు చూస్తుంటే భారీ మొత్తంలోనే ఉన్నాయి. ఆ తర్వాత నాగార్జున లుక్ రివీల్ అయింది. అందులో అతడు వర్షంలో గొడుగు వేసుకుని కనిపించాడు. అయితే నాగ్ ఆ వర్షంలో నడిచి వస్తుంటే ఒక ఐదు వందల నోటు రోడ్ పై కనిపిస్తుంది.
Also Read: లుక్ ఏమో బిచ్చగాడిలా.. టైటిల్ ఏమో ‘కుబేర’.. ఎక్కడో తేడా కొడుతుంది..
దీంతో అది చూసిన నాగ్ తన జేబులోంచి కొంత డబ్బులు తీసి మొదటిగా చూపించిన డబ్బుల కట్టల్లో వేసేస్తాడు. ఇది చూసిన ప్రేక్షకులు ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని కామెంట్లు పెడుతున్నారు. 51 సెకెన్ల నిడివితో రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ గ్లింప్స్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించాయి.దీంతో ఈ మూవీలో నాగ్ క్యారెక్టర్ ఎలా ఉండనుందో మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. అంతా ఓకే కానీ ఇందులో నాగార్జున లుక్ సేమ్ ‘బ్రీత్’ సినిమాలో హీరో నందమూరి చైతన్య కృష్ణను తలపించేలా ఉంది. సేమ్ షర్ట్, సేమ్ ఫ్యాంట్, కళ్లద్దాలు, వర్షంలో గొడుగుతో లుక్ ఇలా చూసుకుంటే అన్నీ సేమ్ టు సేమ్‌గా ఉన్నాయి.
దీంతో చాలామంది ఇదేంటి నాగ్ లుక్.. చైతన్య లుక్ ఓకేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం దర్శకుడు శేఖర్ కమ్ముల మాత్రం ఈ సినిమాను గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే ఈ మూవీలో ధనుష్‌కి జోడీగా నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీ ప్రసాద్ దరువేస్తున్నాడు. ఈ చిత్రాన్ని త్వరలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నారు.
Also Read: Aishwarya Rajinikanth: కొత్త ఇంటిని కొనుగోలు చేసిన ఐశ్వర్య రజినీకాంత్.. సూపర్ స్టార్ స్మైల్ చూశారా?