E-Paper
Advertisement

Rashmika: బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన రష్మిక.. ఇద్దరు కలిసి ఏ సినిమాలో నటిస్తున్నారంటే.?

Rashmika: బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన రష్మిక.. ఇద్దరు కలిసి ఏ సినిమాలో నటిస్తున్నారంటే.?
Advertisement

Rashmika: ప్రస్తుతం సౌత్ నార్త్ ఇండస్ట్రీలో, వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్న ఏకైక హీరోయిన్ రష్మిక. ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్నబ్యూటీ. ఇటీవల సికింధర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ రెస్పాన్స్ ను అందుకుంది. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..

బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన రష్మిక..

Advertisement

రష్మిక తెలుగు లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప రెండు భాగాల్లోనూ, అల్లు అర్జున్ సరసన నటించిన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ లో ప్రముఖ హీరో రణభిర్ కపూర్ తో కలిసి యానిమల్ సినిమాలో నటించి, బాలీవుడ్ లో తన సత్తాని చాటింది. ఇక ఈ సంవత్సరం చావా మూవీలో విక్కీ సరసన నటించి, ఇండస్ట్రీ హిట్ ని అందుకుంది. ఇక తాజాగా ఆమె చిన్న కార్టూన్ బొమ్మ ‘స్టిచ్’ ను తన న్యూ బాయ్ ఫ్రెండ్ గా పరిచయం చేస్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. స్టిచ్ అనే యానిమేటెడ్ మూవీ లో ఈ కార్టూన్ బొమ్మ కనపడనుంది. ఈ పోస్ట్ లో రష్మిక స్టిచ్ తో ఫోటో ను షేర్ చేసింది. ఆమె ఆ క్యూట్ బొమ్మతో వీడియో ను కూడా షేర్ చేసింది. ఈ యానిమేటెడ్ మూవీ లిలో & స్టిచ్ అనేది, అమెరికన్ సైన్స్ ఫిక్షన్ కామెడీ చిత్రం.మే 23 న ఈ చిత్రం ప్రేషకుల ముందుకు వచ్చింది.  ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ బాయ్ ఫ్రెండ్ అంటే ఇంకా ఎవరినో చూపిస్తుంది అనుకుంటే చిన్న కార్టూన్ బొమ్మను చూపించారేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ది గర్ల్ ఫ్రెండ్..లో విజయ్ వాయిస్ అందుకేనా ..

Advertisement

ఇక విజయ్ దేవరకొండ తో ఆమె రిలేషన్ లో ఉన్నారంటూ, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఉప్పుకార్లు ఊపందుకున్నాయి. గీత గోవిందం సినిమా నుండి వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్, కొనసాగుతూ డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేమగా మారి మారిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దీంతో ఈ జంటకు ప్రత్యేకమైన అభిమానులు కూడా ఉన్నారు. వీరిద్దరిపై రూమర్స్ మొదలైనప్పటినుండి ఎక్కడ చూసినా ఈ జంటగా కనిపిస్తుంది. ఇద్దరూ ఒకరి ఇంట్లో, ఒకరు పండగలు చేసుకోవడం కలిసి వెకేషన్ కి వెళ్లడం, అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేయడంతో, అందరూ మీరు ప్రేమించుకుంటున్నారని అనుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు ఇలాంటి రూమర్స్ పై అటు విజయ్ దేవరకొండ కానీ, ఇటు రష్మిక కానీ స్పందించలేదు. ఇటీవల ది గర్ల్ ఫ్రెండ్ సినిమా టీజర్ కు విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఇవ్వటం జరిగింది. రష్మిక ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ తో పాటు కుబేర, పుష్పా3, రెయిన్ బో, వంటి సినిమాలను లైన్లో పెట్టారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×