Milla Magee: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ – 2025 పోటీల నుంచి మిస్ వరల్డ్ కంటెస్టెంట్, మిస్ ఇంగ్లాండ్-2024 మిల్లా మాగీ తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే, వ్యక్తిగత కారణాలతో పోటీ నుంచి వైదొలిగినట్టు తొలుత ప్రకటించింది. ఆ తర్వాత తను కావాలనే పోటీ నుంచి తప్పుకున్నట్టు.. తనను మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులు ఆట బొమ్మలా చూశారని.. వేశ్య లాగా ట్రీట్ చేశారని ఆమె ఆరోపించిందంటూ.. వార్తలు తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై మిస్ వరల్డ్ నిర్వాహకులు స్పందించారు.
ఇటీవల బ్రిటీష్ మీడియాలో ప్రచారం అవుతోన్న వార్తలపై మిస్ వరల్డ్ సంస్థ ఛైర్‌పర్సన్, సీఈవో జూలియా మోర్లే రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ మిస్ ఇంగ్లాండ్ మాగీ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. మే నెల స్టార్టింగ్ లోనే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ.. తన కుటుంబ సభ్యులు అనారోగ్యానికి లోనవ్వడం వల్ల అత్యవసర పరిస్థితిలో.. ఈ పోటీల నుంచి తప్పుకుంటానని ఆమె సంస్థను కోరినట్టు తెలిపారు. మిల్లా మాగీ పరిస్థితి అర్థం చేసుకున్న తాము వెంటనే స్పందించి ఓకే చెప్పామన్నారు. కుటుంబ సభ్యుల క్షేమం పస్ట్ ప్రయారిటీగా భావించామని తెలిపారు. తక్షణమే ఆమెను ఇంగ్లాండ్‌కు తిరిగి పంపే ఏర్పాట్లు చేసినట్టు ఆమె స్పష్టం చేశారు.
ALSO READ: Rain Alert: ఈ నెల 29 వరకు అతిభారీ వర్షాలు.. పిడుగులతో కూడిన వర్షం, ఈ జిల్లాల వారు జాగ్రత్త!
మాగీ మిస్ వరల్డ్ పోటీల నుంచి వైదొలిగిన తర్వాత మిస్ ఇంగ్లాండ్ మొదటి రన్నరప్ మిస్ షార్లెట్ గ్రాంట్ ఇంగ్లాండ్ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు రెడీ అయినట్టు తెలిపారు. షార్లెట్ మూడు రోజుల క్రితం ఇండియాకు చేరుకున్నారని, మిస్ వరల్డ్ సోదరిభావంతో ఆమెను పోటీల్లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఆమె మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్నారని క్లారిటీ ఇచ్చారు.
ALSO READ: CM Revanth Reddy: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.. రాష్ట్రంలోని కీలక విషయాలు చర్చించిన సీఎం
బ్రిటిష్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తలు ఫేక్ అని తేల్చి చెప్పారు. కొన్ని యూకే మీడియా సంస్థలు మిల్లా మాగీ పోటీల్లో ఎదుర్కొన్న అనుభవాలపై తప్పుడు వార్తలు రాస్తున్నాయని తెలిపారు. అవి పూర్తిగా నిరాధారమైనవని జూలియా మోర్లే వివరించారు. మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ సమయంలో మిస్ మిల్లా మాగీ స్వయంగా వ్యక్తపరిచిన భావాలు, ఎడిట్ చేయని వీడియో క్లిప్‌లు మిస్ వరల్డ్ సంస్థ రిలీజ్ చేసింది. అందులో ఆమె ఆనందం, కృతజ్ఞత, తన ఎక్స్ పీరియన్స్ మెచ్చుకుంటూ మాట్లాడిన దృశ్యాలు కూడా ఉన్నాయని జూలియో మోర్లే పేర్కొన్నారు.