RGV on Sandeep Reddy Vanga : ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు పక్కన పెడితే ఒకప్పుడు బ్రాండ్ డైరెక్టర్ అంటే రామ్ గోపాల్ వర్మ. ఇది కేవలం పేరు కాదు, ఇది ఒక బ్రాండ్. శివ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వర్మ. తెలుగు సినిమా రూపు రేఖలు మార్చేసాడు. సినిమా అంటే ఇలానే ఉండాలి అని కాకుండా ఇలా కూడా ఉండొచ్చు అని నిరూపించాడు. శివ సినిమా చూసిన తర్వాత చాలామంది రూల్స్ బ్రేక్ చేశాడు అంటూ రాంగోపాల్ వర్మను ఉద్దేశించి అన్నారు. కానీ వాస్తవం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ కి అసలు రూల్స్ తెలియదు. అందుకని సినిమాని జెన్యూన్ అటెంప్ట్ చేసి ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత వర్మ తెరకెక్కించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు వర్మా నుంచి మంచి సినిమాను ఎక్స్పెక్ట్ చేయడమే పాపం అయిపోయింది. ఎందుకంటే మనం ఎన్ని అడిగినా ఆయనకు నచ్చిన సినిమా మాత్రమే చేస్తాడు.
చాలామందికి ఇన్స్పిరేషన్
ఇప్పుడు చాలామంది పేరు ఉన్న దర్శకులకు రాంగోపాల్ వర్మ ఒక ఇన్స్పిరేషన్. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చిన వాళ్లే. వర్మ పైన పుస్తకాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో వర్మ థాట్ ప్రాసెస్ చాలామందిని విపరీతంగా ఆకట్టుకునేలా చేసింది. వర్మ సినిమాలకు ఏ రేంజ్ లో అభిమానులు ఉంటారు వర్మ ఇంటర్వ్యూలకు కూడా అదే రేంజ్ అభిమానులు ఉంటారు అనడం అతిశయోక్తి కాదు. వర్మ సరైన సినిమాలు చేయకపోయినా కూడా ప్రస్తుతం వస్తున్న సినిమాలు అన్నిటిని చూసి ఆ సినిమాలు గురించి తన రెస్పాన్స్ తెలియజేస్తాడు.
సందీప్ రెడ్డి వంగా పై ఇష్టం
అర్జున్ రెడ్డి సినిమా చూసిన తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగను ఆకాశానికి ఎత్తేసాడు. అంతేకాకుండా పిలిచి మాట్లాడి ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టాడు. దర్శకుడు సందీప్ రెడ్డికి కూడా రాంగోపాల్ వర్మ ఒక ఇన్స్పిరేషన్. ఆయన సినిమాలు నుంచి నేర్చుకున్న విషయాలను పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు సందీప్. ఇక సందీప్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. దీనిపైన రామ్ గోపాల్ వర్మ స్పందించారు. హే సందీప్ ఆమె అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు మీరు యానిమల్ లో ప్రదర్శించిన నటన రెండింటినీ పరిశీలిస్తే, మీ నిర్ణయం ఆమెను ప్రస్తుత బిగ్గీలను మించి బాలీవుడ్ లో తదుపరి పెద్ద విషయంగా మారుస్తుందని నేను భావిస్తున్నాను … అభినందనలు త్రిప్తి డిమ్రి మీ స్పిరిట్ ఆకాశంలోకి ఎగరడానికి ఇది సరైన సమయం. అంటూ ట్వీట్ చేశాడు.
https://Twitter.com/RGVzoomin/status/1926277006376796613?t=3vZfJl-gl1sBJjt2dIA7hg&s=19