Rashmika Mandanna:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు, గుర్తింపు తెచ్చుకుని, నేడు నేషనల్ క్రష్ గా మారిపోయింది అందాల తార రష్మిక మందన్న (Rashmika Mandanna) . తన నటనతో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె సినిమాల కోసం కుటుంబాన్ని కూడా పక్కన పెట్టిన విషయం తెలిసిందే . ముఖ్యంగా సినిమాలో నటించడానికి తన కుటుంబానికి కూడా సమయం కేటాయించలేకపోతున్నానంటూ ఎన్నోసార్లు బాధపడిపోయింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మిక తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ముఖ్యంగా తన సినిమా విశేషాలు పంచుకునే ఈమె సడన్గా “దయగా ఉండండి” అంటూ పోస్ట్ పెట్టడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
దయతో ఉండండి అంటున్న రష్మిక..
తన ఇంస్టాగ్రామ్ పోస్టులో..” ఈరోజుల్లో అందరిలో కూడా దయ అనేది తగ్గిపోతోంది. నేను మాత్రం అందరిని ఒకేలా చూస్తాను. మీరంతా కూడా అందరిని అలాగే చూడండి. ఒకరిపై ఒకరు దయతో ఉండండి”.. అంటూ రాసుకొచ్చింది రష్మిక మందన్న. అంతేకాదు తాను ధరించిన టీ షర్టు మీద కూడా Kindful (దయ) అనే రాసి ఉంది. దీంతో ఈ పోస్ట్ పై నెటిజన్లు పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.
ఇన్ డైరెక్ట్ గా విజయ్ దేవరకొండకు కౌంటర్ ఇచ్చిందా..?
అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల రష్మిక, విజయ్ దేవరకొండ ఇద్దరూ జిమ్లో కలిసి కనిపించిన వీడియో తెగ వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే జిమ్ లో నుంచి బయటకి వచ్చిన విజయ్ దేవరకొండ (Vijay deverakonda) కారులో కూర్చోగా.. కాలికి గాయం అవ్వడం వల్ల రష్మిక ఇబ్బంది పడుతూ కారు ఎక్కింది. ఈ వీడియో చూసిన కొంతమంది విజయ్ దేవరకొండ పై విమర్శలు గుప్పిస్తున్నారు. పాపం ఆమెకు కాలు బాగాలేక కారు ఎక్కడానికి ఇబ్బంది పడుతుంటే.. మీరు సహాయం చేయవచ్చు కదా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రష్మిక పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. ఏదేమైనా రష్మిక పెట్టిన పోస్ట్ ఇండైరెక్టుగా విజయ్ దేవరకొండ కే అన్నట్టుగా నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
రష్మిక మందన్న సినిమాలు..
గత ఏడాది అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, సుకుమార్ (Sukumar )దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప 2’ సినిమాలో నటించింది రష్మిక. ఇందులో శ్రీవల్లి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్లో ‘ఛావా’ సినిమా రూపొందుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో శంభాజీ మహారాజుగా విక్కీ కౌశల్ (Vicky koushal) , ఆయన భార్య పాత్రలో రష్మిక నటిస్తోంది. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రంతోపాటు సల్మాన్ ఖాన్ (Salman Khan) సరసన సికిందర్ లో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రానికి ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు థామ, ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో, కుబేర వంటి చిత్రాలలో హీరోయిన్గా నటిస్తోంది రష్మిక.
Kindness is so underrated these days. 🤍🌻
I choose kindness and everything that comes with it. 🤍
Let’s all be kind to each other ❤️ pic.twitter.com/EPNkzfqlmB— Rashmika Mandanna (@iamRashmika) February 5, 2025