Cricket Match Ticket Chaos | ఒడిశా కటక్‌లోని బారాబటి స్టేడియంలో ఈ నెల 9న జరగనున్న భారత్, ఇంగ్లాండ్ మధ్య వన్డే క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే టికెట్ల విక్రయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో చేరుకుని రాత్రంతా పడిగాపులు చేశారు. ఉదయం 9 గంటల నుంచి కౌంటర్‌లో విక్రయించే టికెట్ల కోసం అర్ధరాత్రి నుంచే జనాలు చేరడంతో, ఒక సమయంలో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి అదుపు చేయడానికి చివరికి పోలీసులు రావాల్సి వచ్చింది. స్టేడియం వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
స్టేడియంలోని 4 కౌంటర్ల వద్ద ఫుల్ రష్
టికెట్ల విక్రయానికి స్టేడియం యజమాన్యం 4 కౌంటర్లు ఏర్పాటు చేయగా.. ఇందులో దాదాపు 12 వేల టికెట్లు విక్రయించబడ్డాయి. రద్దీ నియంత్రణ కోసం పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆన్‌లైన్‌లో టికెట్లు దక్కించుకోలేని క్రికెట్ అభిమానులు వాటిని ఆఫ్‌లైన్‌లో కొనాలని ఎగబడడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. స్పెషల్ ఎన్‌క్లోజర్, ఏసీ గ్యాలరీ, న్యూ పెవిలియన్, కార్పొరేట్ బాక్స్ టికెట్లు.. గురప్రు గేట్ ప్రాంగణంలో విక్రయించబడ్డాయి. మిగిలిన అన్ని గ్యాలరీ టికెట్లను కిల్ఖానా లేక్‌లోని 3 కౌంటర్లలో విక్రయానికి ఏర్పాట్లు చేశారు. తొలిసారిగా మహిళా ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఒక కౌంటరు ఏర్పాటు చేయబడింది.
ప్రత్యేక బస్సులు
బారాబటి స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ పురస్కరించుకుని కటక్ నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా స్టేడియం లోపల, వెలుపల గట్టి భద్రతా చర్యలు చేపట్టబడ్డాయి. కటక్ నగర పాలక సంస్థ స్టేడియం పరిసరాల్లో సుందరీకరణ, పారిశుధ్యం, ఫాగింగ్ కార్యకలాపాలను చేపట్టింది. ఈ మేరకు ఉన్నత స్థాయి సమావేశంలో మ్యాచ్ సన్నాహాలను సమీక్షించారు. కటక్ జిల్లా యంత్రాంగం, ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (ఓసీఏ), ఒడిశా ఒలింపిక్ అసోసియేషన్, పోలీసు, ఆరోగ్య విభాగాలు, నగర పాలక సంస్థ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Also Read: శిఖర్ ధావన్ లేకపోవడం టీమిండియాకు ఎంత నష్టమో తెలుసా.. కోహ్లీ, రోహిత్ కూడా పనికిరారు !
నేటి నుంచే వన్డే సిరీస్.. ఉచితంగా చూడవచ్చు
టీమ్ ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య ఈ రోజు నుంచి మొదటి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఐదు టి20 సిరీస్‌లను టీమ్ ఇండియా కైవసం చేసుకున్నది. ఇప్పుడు వన్డే సిరీస్ పై భారత జట్టు ధీమాగా ఉంది. ఈ సిరీస్ లో టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య 3 వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు నాగపూర్ పట్టణంలోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ మ్యాచ్ ఈ రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంటకు జరగనుంది. మొదటి టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన వన్డేలలో భారత్ 58 సార్లు విజయం సాధించగా.. ఇంగ్లాండ్ 44 సార్లు విజేతగా నిలిచింది. ఫలితం రానివి 3 మ్యాచ్‌లు కాగా, డ్రాగా 2 మ్యాచ్‌లు ముగిసాయి. అయితే ఈ రోజు జరిగే వన్డే మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా ఎవరు బరిలోకి దిగుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఇద్దరూ టీమ్ ఇండియా స్క్వాడ్‌లో ఉన్నారు. ఇద్దరిలో తుది జట్టులో ఎవరికి అవకాశం లభిస్తుందో అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, కెఎల్ రాహుల్‌ను విశ్రాంతినిచ్చి ఈ మ్యాచ్ కు రిషబ్ పంత్‌ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ రోజు మ్యాచ్‌లో హైలైట్.. మహమ్మద్ షమీ ఎంట్రీ.
భారత్ vs ఇంగ్లాండ్ 1వ ODI మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం
భారతదేశంలో IND vs ENG 1వ ODI మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డి/ఎస్‌డి ఇండియా vs ఇంగ్లాండ్ మ్యాచ్‌ను ఇంగ్లీష్ కామెంటరీతో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అయితే స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ హెచ్‌డి/ఎస్‌డి హిందీ కామెంటరీలో ఉంటుంది. అలాగే, భారత్ vs ఇంగ్లాండ్ 1వ ODI మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో కూడా అందుబాటులో ఉంటుంది. అదే విధంగా, వెబ్‌సైట్‌లో కూడా ఈ మ్యాచ్‌ను చూడగలరు.