Jr NTR Wife :ఈమధ్య కాలంలో స్టార్ హీరోల భార్యలందరూ దాదాపుగా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన భార్యకి కూడా ఒక స్థానాన్ని కల్పించి, ఆమె కంటూ ఒక గుర్తింపును క్రియేట్ చేయాలని ఆలోచిస్తున్నారట ఎన్టీఆర్(NTR ). ఈ మేరకు తన భార్య లక్ష్మీ ప్రణతి (Lakshmi Pranathi) ని కూడా బిజినెస్ రంగంలోకి దింపబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా లక్ష్మీ ప్రణతి మీడియా ముందు పెద్దగా కనిపించరు. అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండరు. ఎప్పుడో చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే ఫ్యామిలీతో కలిసి కెమెరా కంటికి చిక్కుతూ ఉంటారు. అలాంటి ఈమెను మరింత పాపులారిటీ చేయడం కోసం అలాగే తన సొంత లాభార్జన కోసం ఆమెను బిజినెస్ రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం. అయితే లక్ష్మీ ప్రణతిని బిజినెస్ రంగంలోకి దింపడం వెనుక అసలు కారణం వేరే ఉందని పలువురు కామెంట్లు గమనార్హం.
అభిమానుల కోసం మాస్టర్ ప్లాన్ చేసిన ఎన్టీఆర్..
అసలు విషయంలోకెళితే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అచ్చం తాత పోలికలతో ఉన్న ఈ నందమూరి వారసుడికి, ఫ్యాన్ బేస్ ఎంతో ఉంది. మరొకవైపు ఎన్టీఆర్ కూడా తన అభిమానులను ప్రాణం పెట్టి చూసుకుంటారు. ఈ నేపథ్యంలోనే అభిమానుల కోసం ఆయన ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అందులో భాగంగానే అభిమానులకు, ఏపీ ప్రజలకు దగ్గరయ్యేలా తన భార్య లక్ష్మీ ప్రణతిని బిజినెస్ రంగంలోకి దింపబోతున్నారట.ఇదే సమయంలో అటు ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని టీడీపీ పార్టీని ఆదుకునేది ఆయన మాత్రమే అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పార్టీ విజయకేతనం ఎగరేసి చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) సీఎం అయ్యారు. అయినప్పటికీ కూడా నందమూరి అభిమానుల కన్ను ఎన్టీఆర్ పైనే ఉంది. ఆయనే రాష్ట్రానికి సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. అందుకే ఫ్యాన్స్ డిమాండ్ మేరకు ఈ పరిస్థితుల్లో తన భార్యతో కలిసి ఎన్టీఆర్ ఒక మాస్టర్ ప్లాన్ చేశారని సమాచారం.
బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్న లక్ష్మీ ప్రణతి..
తన భార్య లక్ష్మీ ప్రణతిని రంగంలోకి దించుతూ.. కొత్త బిజినెస్ ప్లాన్ చేశారట. ఈ బిజినెస్ ఏపీ ప్రజలకు అవసరాలు తీర్చడమే కాకుండా తనను ప్రజలతో మమేకం చేస్తూ తన రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసేలా ఉందనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి ఆ బిజినెస్ ఏంటనే విషయం ఇంకా పూర్తి క్లారిటీగా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నారు. ఏది ఏమైనా తన తాత లాగే ఆయనను కూడా సీఎం హోదాలో చూడాలని అభిమానులు కోరుకుంటున్న నేపథ్యంలో ఎన్టీఆర్ అడుగులు ఎటువైపో చూడాలి. ఇకపోతే తనపై అభిమానులు ఇంత ప్రేమను చూపిస్తున్న నేపథ్యంలో హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే వారిని కలుసుకోవడం కోసం ఒక మీటింగ్ కూడా నిర్వహించనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సమావేశం నిర్వహించడానికి సమయం పడుతుంది కాబట్టి అభిమానులు ఓర్పుగా ఉండాలని కూడా కోరారు ఎన్టీఆర్.