Rashmika Remuneration.. ఒక్క సినిమా మన జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టుగానే.. మంచి క్యారెక్టర్ పడితే ఎలాంటి క్రేజ్ లభిస్తుందో నిరూపిస్తోంది రష్మిక మందన్న (Rashmika Mandanna). తాజాగా హిట్ లతో హ్యాట్రిక్ కాదు ఏకంగా బ్లాక్ బస్టర్స్ తో హ్యాట్రిక్ అందుకొని అందరిని ఆశ్చర్యపరిస్తోంది. గత ఏడాది వచ్చిన ‘యానిమల్’, ‘పుష్ప 2’ లతోపాటు ఇటీవల ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైన ‘ఛావా’ సినిమాలతో ఏకంగా హ్యాట్రిక్ అందుకొని సంచలనం సృష్టించింది. పుష్ప 2, యానిమల్ చిత్రాలు కలిపి రూ.3వేల కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేయగా.. ఇప్పుడు ఛావా కూడా సరికొత్త సంచలనం సృష్టించబోతుందని చెప్పవచ్చు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడైన శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఛావా.. ఇందులో విక్కీ కౌశల్(Vicky kaushal) శంభాజీ మహారాజ్ గా నటించగా.. ఆయన భార్య యేసు భాయ్ పాత్రలో రష్మిక ఒదిగిపోయింది. తన అద్భుతమైన నటనతో అందరిని మెప్పించిన ఈ అమ్మడు ఈ ఒక్క సినిమాతో భారీ పాపులారిటీ అందుకుంది.
ఛావా కోసం ఆశ్చర్యపరుస్తున్న రష్మిక రెమ్యూనరేషన్..
ఛావా సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ.120 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక సోమవారం రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా దాదాపు 30 కోట్ల రూపాయల మేర కలెక్షన్లు వచ్చాయి అంటే ఈ హిస్టారికల్ మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. ఇక ఇదే ఊపులో దూసుకుపోతే మరో వారం రోజుల్లో రూ.500 కోట్లకు పైగా నెట్ వసూలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపోతే ఛావా సినిమాతో ఆల్ టైం బ్లాక్ బస్టర్ ని అందుకున్న రష్మిక మందన్న.. బాలీవుడ్ నిర్మాతల పాలిట గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించినందుకు గానూ నిర్మాతలు ఏకంగా రూ. 15 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారు. బ్లాక్ బ్యాక్ టు బ్యాక్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోయిన్స్ బాలీవుడ్ లో రష్మిక తప్ప మరొకరు లేరని తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ వరుస బ్లాక్ బాస్టర్లు అందుకున్న నేపథ్యంలో రష్మిక భారీగా డిమాండ్ చేసిందని ఆమె డిమాండ్ మేరకు నిర్మాతలు కూడా ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం.
స్టార్ హీరోయిన్లను వెనక్కి నెట్టి దేశంలోనే నెంబర్ వన్ స్థానం..
ఇప్పటివరకు దీపిక పదుకొనె (Deepika Padukone), నయనతార (Nayanthara), ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) వంటి హీరోయిన్లే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 12 కోట్ల రూపాయల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటూ హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ గా రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసి హీరో రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకొని నంబర్ వన్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. ఇకపోతే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈమెతో పాటు ఈ సినిమాలో హీరో పాత్రలో నటించిన విక్కీ కౌశల్ కి కేవలం రూ.10 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే రష్మిక క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
రష్మిక మందన్న కెరియర్..
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అంటూ దూసుకుపోతున్న ఈమె.. సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా నటిస్తున్న సికిందర్ సినిమాలో హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమా కోసం కూడా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోబోతుందట. వీటితోపాటు మరికొన్ని చిత్రాలు లైన్లో ఉంచింది రష్మిక.