IPL 2025 – SRH Final: భారత క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 18వ సీజన్ మార్చి 22 నుండి ప్రారంభం కాబోతోంది. ఈ ఐపీఎల్ 18వ సీజన్ మే 25వ తేదీ వరకు.. అంటే 65 రోజులపాటు 74 మ్యాచ్ లు, 13 వేదికలలో జరగబోతున్నాయి. రెండు నెలలకు పైగా జరిగే ఈ మెగా టోర్ని షెడ్యూల్ ని ఫిబ్రవరి 16న బీసీసీఐ అధికారికంగా విడుదల చేసింది. ఆరంభ మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ కలకత్తా నైట్ రైడర్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య జరగబోతోంది.
ఇక ఈ సీజన్ లో హైదరాబాద్ లో ఒక క్వాలిఫైయర్, ఒక ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. కాగా ఐపీఎల్ చరిత్రలో సన్రైజర్స్ హైదరాబాద్ {ఎస్.ఆర్. హెచ్} అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటని చెప్పవచ్చు. ఈ జట్టు తన తొలి మ్యాచ్ ని మార్చి 23న రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుంది. సొంత గడ్డపై ఏడు, వేరే జట్ల వేదికలపై ఏడు మ్యాచ్ లను ఆడబోతోంది హైదరాబాద్ జట్టు.
సొంత గడ్డపై SRH మార్చ్ 23న ఆర్ఆర్ తో, మార్చి 27న లక్నో, ఏప్రిల్ 6న గుజరాత్, ఏప్రిల్ 12 పంజాబ్, ఏప్రిల్ 23న ముంబై, మే 5న ఢిల్లీ, మే 10న కలకత్తా జట్లతో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ లు ఆడబోతోంది. అలాగే హైదరాబాద్ జట్టు ఇవే మ్యాచ్ లను వేరే జట్లతో .. మార్చి 30న ఢిల్లీలో, ఏప్రిల్ 3న కలకత్తాలో, ఏప్రిల్ 17న ముంబైలో, ఏప్రిల్ 25న చెన్నైలో, మే 2న గుజరాత్ లో, మే 13న బెంగళూరులో, మే 18న లక్నోలో తన ఆఖరి లీగ్ మ్యాచ్ ని ఆడబోతోంది.
గతేడాది సీజన్ లో అద్భుత ఆటతీరుతో ఫైనల్ కీ చేరిన సన్రైజర్స్.. రన్నరప్ గా నిలిచింది. కానీ ఈసారి ఛాంపియన్ గా నిలవాలని పట్టుదలతో ఉంది. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే క్వాలిఫై అయ్యిందంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయాన్ని అన్నది మరెవరో కాదు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్. హైదరాబాద్ జట్టు ఇప్పటికే క్వాలిఫై అయ్యిందని, మిగిలిన 9 జట్లు పోటీ పడుతున్నాయని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ ట్వీట్ చేసినట్లుగా ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఎస్.ఆర్.హెచ్ అభిమానులు.
Also Read: Akhil Akkineni – RCB: బెంగుళూరు కెప్టెన్ గా అక్కినేని అఖిల్..షాక్ లో రజత్?
ఇది చూసిన మరి కొంతమంది అభిమానులు అప్పుడే దిష్టి పెట్టకండి అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఐపీఎల్ 2025 సీజన్ కి సంబంధించి హైదరాబాద్ జట్టు వివరాలను చూస్తే : పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, అథర్వ తైదే, అభినవ్ మనోహర్, సిమర్‌జీత్ సింగ్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, కమిండోన్ కార్సే, కమిండోన్ కార్సే, సచిన్ బేబీ.