BigTV English

Railway News: ఆ రైల్వే‌స్టేషన్ మూసివేత.. మరో మార్గంలో రైళ్లు రాక, ఇంతకీ ఎక్కడ?

Railway News: ఆ రైల్వే‌స్టేషన్ మూసివేత.. మరో మార్గంలో రైళ్లు  రాక, ఇంతకీ ఎక్కడ?

Railway News: మహా కుంభ మేళా నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి ప్రయోగ్‌రాజ్‌కు ప్రత్యేకంగా రైళ్లను నడుపుతోంది రైల్వేశాఖ. కుంభమేళా ముగింపు దగ్గరపడుతున్న నేపథ్యంలో పుణ్య స్నానాల కోసం బయలుదేరుతున్నారు భక్తులు. దీంతో రోజు రోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. న్యూఢిల్లీ, బీహార్‌లో జరిగిన ఘటన కారణంగా కీలక నిర్ణయాలు తీసుకుంది ఆ శాఖ. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌ సంగం రైల్వేస్టేషన్ ఫిబ్రవరి 26 మూసి వేసింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రయోగ్‌రాజ్ జంక్షన్ వచ్చే 15 రైళ్లను దారి మళ్లించారు అధికారులు.


మహా కుంభమేళాకు వచ్చే భక్తుల రద్దీ పెరిింది. మహా కుంభోత్సవం తర్వాత ఫిబ్రవరి 27 నుండి ప్రయోగ్ రాజ్ సంగం రైల్వే స్టేషన్ నుండి తిరిగి రైళ్లు నడపనున్నాయి. చాలా మంది భక్తులకు ఈ విషయం తెలియక స్టేషన్ రావడం జరిగింది. దీంతో స్టేషన్ ఆవరణలో పోలీసులు మోహరించారు. ప్రయాణికుల ప్రవేశాన్ని నిలిపి వేశారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రయోగ్ రాజ్ జంక్షన్ వచ్చే 15 రైళ్లను దారి మళ్లించారు.

దారి మళ్లించిన రైళ్లలో ప్రధానంగా ఉన్నాయి. 15017-లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్.. గోరఖ్‌పూర్-కాన్పూర్ సెంట్రల్-లక్నో-బారాబంకి-గోరఖ్‌పూర్ మీదుగా వెళ్తుంది. బల్లియా- కాన్పూర్ సెంట్రల్-లక్నో- జౌన్‌పూర్-వారణాసి మీదుగా వెళ్తుంది. 12488-ఆనంద్ విహార్ రైలు.. జోగ్బానీ-కాన్పూర్ సెంట్రల్-లక్నో-బారాబంకీ-గోరఖ్‌పూర్ మీదుగా వెళ్తుంది.


15484-ఢిల్లీ అలీపుర్దువార్ రైలు- కాన్పూర్ సెంట్రల్ – లక్నో – బారాబంకి – గోరఖ్‌పూర్ మీదుగా రానుంది. 15018-గోరఖ్‌పూర్ లోకమాన్య తిలక్ రైలు.. కాన్పూర్ సెంట్రల్-వీరంగన లక్ష్మీబాయి ఝాన్సీ మీదుగా వెళ్తుంది. 11072-బల్లియా-లోకమాన్య తిలక్ రైలు.. కాన్పూర్ సెంట్రల్-వీరంగన లక్ష్మీబాయి ఝాన్సీ మీదుగా రానుంది.

ALSO READ: ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఆ రూట్లో రైళ్లు రద్దు, ఎందుకు?

న్యూఢిల్లీలో తొక్కిసలాట తర్వాత ఆ మార్గంలో అనేక రైళ్లపై ప్రభావం చూపింది. ఈ కారణంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కొద్ది గంటలపాటు రీషెడ్యూల్ చేశారు. దీని కారణంగా చాలా మంది వీఐపీలు ప్రయోగ్ రాజ్‌కు ఆలస్యం చేరుకున్నారు. బనారస్ నుండి న్యూఢిల్లీకి వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇప్పటికే రెండు గంటలు రీషెడ్యూల్ చేశారు. చాలా రైళ్లు ఆలస్యంగా చేరుకుంటున్నాయి.

మరోవైపు మహా కుంభ మేళాకు వెళ్లే దారిలో 300 కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ జామ్ అయ్యింది.త్రివేణి సంగమం వద్దకు చేరుకునేందుకు 10 నుంచి 12 గంటల సమయం పడుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతానికి వచ్చే ఆరు రూట్లలో వాహనాలు ముందుకు కదల్లేదు. వారణాసి నుంచి ప్రయాగ్ రాజ్ వచ్చే దారిలో 25 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఫిబ్రవరి 17 వరకు 54 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేసినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మహా కుంభ మేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది.

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం జరిగిన ఘటన నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్టేషన్లలో రద్దీ నియంత్రణ కోసం శాశ్వత, తాత్కాలిక హోల్డింగ్‌ జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  అత్యధిక రద్దీ ఉండే 60 రైల్వే స్టేషన్లలో హోల్డింగ్‌ జోన్లను నిర్మించాలని నిర్ణయించినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. వాటిలో ఢిల్లీ, పట్నా, సూరత్, బెంగళూరు, కోయంబత్తూర్‌ తదితర స్టేషన్లు ఉన్నాయి.

ప్రయాగ్‌రాజ్‌లో చేపట్టిన ఈ విధానం విజయవంతమైందన్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ తొక్కిసలాట ఘటనపై నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రయాణికులు నడిచే వంతెన మీద కారణం లేకుండా నిలిచి ఉండటాన్ని నిషేధించింది.

Related News

Dasara Special Trains: దసరా వేళ రైల్వే గుడ్ న్యూస్, ముంబై నుంచి కరీంనగర్ కు స్పెషల్ ట్రైన్!

Sunrise Express: వావ్.. జపాన్ స్లీపర్ రైలు ఇలా ఉంటుందా? బెర్తులు భలే ఉన్నాయే!

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఇబ్బందులు

Afghan Boy: విమానం ల్యాండింగ్ గేర్‌‌‌లో 13 ఏళ్ల బాలుడు.. కాబూల్ నుంచి ఢిల్లీకి ట్రావెల్

Stealing Bedsheets: ఏసీ కోచ్ లో దుప్పట్లు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రిచ్ ఫ్యామిలీ

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Big Stories

×