BigTV English

PadmaBhushan: నందమూరి హీరోల మధ్య మంటను చల్లార్చిందా..?

PadmaBhushan: నందమూరి హీరోల మధ్య మంటను చల్లార్చిందా..?

PadmaBhushan.. నందమూరి కుటుంబంలో హీరోల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా అగ్గి రాజుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎన్టీఆర్ (NTR ) వర్సెస్ బాలకృష్ణ (Balakrishna) అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకి కూడా ఎంతోమంది యంగ్ హీరోలను మొదలుకొని సీనియర్ స్టార్ హీరోల వరకు వచ్చి సందడి చేస్తుంటే, బాలకృష్ణ వల్లే ఎన్టీఆర్ ఈ షోకి రావడం లేదనే వాదనలు వినిపించాయి. మరొకవైపు ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని అందరి ప్రశంసలు అందుకుంటుంటే.. బాలకృష్ణ మాత్రం ఆయన సక్సెస్ ను ఓర్వలేకపోతున్నారని కూడా కామెంట్లు చేశారు. మరొకవైపు బాలకృష్ణ అసలు ఎన్టీఆర్ ను తన కుటుంబంలోకి ఆహ్వానించడానికి ఆసక్తి చూపించడం లేదని కూడా వార్తలు వైరల్ చేస్తున్న విషయం తెలిసిందే.


బాలయ్యకి పద్మభూషణ్..

అయితే ఇప్పుడు ఇలాంటి వార్తలు అన్నింటికీ చెక్ పెట్టేలా పద్మభూషణ్ అవార్డు చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే .. కేంద్ర ప్రభుత్వం ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సినీ పరిశ్రమకు అందించిన విశేషమైన సేవలను గుర్తించి, పలువురు కళాకారులకు పద్మ అవార్డులను అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా పరిశ్రమ నుంచి హీరో అజిత్ (Ajith), హీరోయిన్ శోభన(Shobhana )హీరో బాలకృష్ణ లకు పద్మభూషణ్ అవార్డు లభించింది. ఇక ఈ విషయం తెలిసి బాలకృష్ణకి సినిమా ఇండస్ట్రీ నుంచి అభినందన వెల్లువలు వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవి(Cjiranjeevi), వెంకటేష్(Venkatesh ), మహేష్ బాబు(Maheshbabu ) లాంటి భారీ తారాగణం కూడా బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


పద్మభూషణ్ నందమూరి హీరోల మధ్య గ్యాప్ తగ్గించిందా..

ఇక ఇప్పుడు బాబాయికి పద్మభూషణ్ అవార్డు రావడంతో అబ్బాయిలు కళ్యాణ్ రామ్ (Kalyan Ram), ఎన్టీఆర్(NTR) కూడా ట్వీట్లు చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు . ” మీరు సినీ పరిశ్రమకు చేసిన సేవలు, చేసే సామాజిక సేవలకు నిదర్శనంగా ఈ అవార్డు వచ్చింది” అంటూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పందించారు. ఇక వీరు వేసిన ట్వీట్లతో నందమూరి అభిమానులే కాదు ఎన్టీఆర్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.” బాల బాబాయ్ కి ఇలాంటి గొప్ప ప్రతిష్టాత్మక అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని” ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తమ తమ ట్వీట్ల ద్వారా తెలియజేశారు. ఇక ఈ విషయం తెలిసి నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు కలిసిపోయి సంబరాలు చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరోలు ఇద్దరు కలిసిపోయారని ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు. ముఖ్యంగా అభిమానులందరూ కూడా ఈ సందర్భం కోసమే వెయ్యి కళ్లతో ఎదురు చూసామని వరుస కామెంట్లు పెడుతూ ఉండడం గమనార్హం. జై బాలయ్య అని ఒకవైపు, జై ఎన్టీఆర్ అని మరొకవైపు నినాదాలతో అభిమానులు హోరెత్తిస్తున్నారు ఏది ఏమైనా ఒక్క పద్మ భూషణ్ అవార్డు అటు బాలకృష్ణ ఇటు ఎన్టీఆర్ మధ్య ఉన్న చిచ్చును ఆర్పేసిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సంతోషంలో ఇద్దరు కలిసి ఒకే వేదికపై కనిపించాలని కూడా కోరుకుంటూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే ఈ పద్మభూషణ్ రాక నందమూరి కుటుంబంలో సంబరాలు నింపింది అని చెప్పవచ్చు. ఇక ఇప్పటికైనా ఈ ఇద్దరు హీరోలు కలిసిపోయి సినీ ఇండస్ట్రీకి మరిన్ని సేవలు అందజేయాలని కోరుకుంటున్నారు. సినిమా పరంగానే కాదు రాజకీయంగా కూడా ఇద్దరూ కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కూడా కోరుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×