BigTV English

Raviteja Warns to Harish Shankar: ఓవర్ చేయకురా.. హరీష్ శంకర్ కు రవితేజ స్వీట్ కౌంటర్!

Raviteja Warns to Harish Shankar: ఓవర్ చేయకురా.. హరీష్ శంకర్ కు రవితేజ స్వీట్ కౌంటర్!

Raviteja Warns to Director Harish Shankar: మాస్ మహారాజా రవితేజ మాట తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నవ్వుతూనే నరాలు లాగేసాడు. ఇక ఆయన కామెడీ టైమింగ్ గురించి అస్సలు మాట్లాడుకోనవసరం లేదు. రీల్ అయినా.. రియల్ అయినా రవితేజ కామెడీ టైమింగ్ సూపర్ అని చెప్పొచ్చు.


ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ తో రవితేజకు ఉన్న అనుబంధం అందరికి తెల్సిందే. వీరిద్దరి కాంబోలో మిరపకాయ్ సినిమా వచ్చింది. అప్పటినుంచి వీరి మధ్య స్నేహ బంధం మొదలయ్యింది. హరీష్.. రవితేజను ఒక అన్నయ్యలా భావిస్తాడు.

ప్రస్తుతం వీరి కాంబోలో మిస్టర్ బచ్చన్ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, షో రీల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే చాలాబాగం వరకు షూటింగ్ ను పూర్తి చేసిన హరీష్ శంకర్ ప్రస్తుతం కాశ్మీర్ వ్యాలీలో సాంగ్ షూట్ చేస్తున్నారు.


ఇక అక్కడ ఒక మంచి లొకేషన్ లో రవితేజ దిగిన ఫోటోను హరీష్ షేర్ చేస్తూ.. ప్రపంచకం లో అందరికీ వయసొస్తోంది.. అన్నయ్యకి తప్ప అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ పోస్ట్ కు రవితేజ రిప్లై ఇస్తూ.. ఓవర్ చేయకురోయ్.. నీ దిష్టే తగిలేలా ఉంది అంటూ స్వీట్ కౌంటర్ వేశాడు.

Also Read: Vijayashanti Birthday : లేడీ సూపర్ స్టార్ విజయశాంతి.. పోలీస్ లుక్ లో ఏముంది బాసూ

ఇక ఫొటోలో వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ డ్రెస్ లో రవితేజ అదిరిపోయాడు. హరీష్ శంకర్ చెప్పడం కానీ, నిజంగానే ఆయనకు వయసు వెనక్కి వెళ్తుందా అన్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈసినిమాతో ఈ కాంబో ఇంకో విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×