BigTV English

Pat Cummins Hat-Trick: ప్యాట్ కమిన్స్ రెండో హ్యాట్రిక్.. వరల్డ్ రికార్డ్..!

Pat Cummins Hat-Trick: ప్యాట్ కమిన్స్ రెండో హ్యాట్రిక్.. వరల్డ్ రికార్డ్..!

Pat Cummins Creates History with Second Consecutive T20 World Cup hat-trick: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ టీ 20 ప్రపంచకప్ లో మరో హ్యాట్రిక్ తీసి సంచలనం సృష్టించాడు. ఒక బౌలర్ జీవితాంతం క్రికెట్ ఆడినా, తన కెరీర్ మొత్తమ్మీద ఒక హ్యాట్రిక్ ఉండటమే ఎక్కువ. అలాంటిది ప్యాట్ కమిన్స్ వరుస మ్యాచ్ ల్లో రెండు హ్యాట్రిక్ లు తీసి ఏకైక బౌలర్ గా నిలవడమే కాదు.. ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించి.. క్రికెట్ లో కొత్త చరిత్ర రాశాడు.


టీ 20 ప్రపంచకప్ సూపర్ 8లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో హ్యాట్రిక్ తీసిన కమిన్స్, నేడు ఆఫ్గాన్ తో జరిగిన మ్యాచ్ లో కూడా మరో హ్యాట్రిక్ తో అదరగొట్టాడు. డెత్ ఓవర్లలో ఆఫ్గాన్ల దూకుడుకి బ్రేక్ వేస్తూ చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్  చివరి బంతికి రషీద్ ఖాన్ ను అవుట్ చేసిన కమిన్స్.. 20 ఓవర్ తొలి బంతికే కరీమ్ జనత్ ను పెవిలియన్ కు చేర్చాడు. తర్వాత బంతికే గుల్బాదిన్ ను కూడా అవుట్ చేశాడు. వీరు వరుసగా క్యాచ్ లు ఇచ్చారు.

ఇక ఇదే ఓవర్ లో మూడో బంతికి ఆఫ్గాన్ బ్యాటర్ ఖరోటే ఇచ్చిన క్యాచ్ ను డేవిడ్ వార్నర్ నేలపాలు చేశాడు. లేకపోతే వరుసగా నాలుగు వికెట్లు తీసి చరిత్ర స్రష్టించేవాడే. తగ్గేదేలే అనే వార్నర్ ఇలా చేయడంతో కమిన్స్ ఉసూరుమన్నాడు. ఇంతకాలం కెరీర్ లో ఎన్నో అద్భుత విజయాలను సాధించాడు. 2023 వన్డే వరల్డ్ కప్ కూడా తన కెప్టెన్సీలోనే  కమిన్స్ సాధించాడు. కానీ ఇవేవీ కలిగించని ఆనందం తన బౌలింగులో వికెట్లు పడినప్పుడే వస్తుందని అంటున్నాడు.


Also Read: సూపర్ 8లో పాట్ కమిన్స్‌ రెండో హ్యాట్రిక్‌.. ఆసిస్ ను చిత్తు చేసిన అఫ్గానిస్థాన్‌..

వార్నర్ క్యాచ్ వదలకుండా ఉంటే, ఆ నాలుగు వికెట్లు పడితే ఆ మజాయే వేరుగా ఉండేది, ఆ కిక్కే వేరుగా ఉండేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఎంత కమిన్స్ వరుస హ్యాట్రిక్ లు తీసినా ఆ ఆనందం వారికి లేకుండా పోయింది. ఎందుకంటే ఆఫ్గాన్ చేతిలో ఓడిపోవడంతో వారికి పరువు పోయినంత పనైంది. ఇప్పుడా కసి, ప్రతీకారం భారత్ తో జరగనున్న మ్యాచ్ లో తీర్చుకోరు కదా…అని కొందరు అంటున్నారు.

Tags

Related News

ODI WORLD CUP 2027 : కొంపముంచిన ఆఫ్ఘనిస్తాన్.. 2027 ప్రపంచ కప్ నుంచి ఇంగ్లాండ్ ఎలిమినేట్?

Team India Jersey : భారీగా పెరిగిన టీమిండియా జెర్సీ వ్యాల్యూ… ఒక్కో మ్యాచ్ కు ఎంత అంటే

Ashwin-Babar : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్?

Yuvi – Msd : Ms ధోనికి యువరాజ్ అంటే వణుకు… అందుకే తొక్కేశాడు!

Hardik – Krunal : పాండ్యా బ్రదర్స్ గొప్ప మనసు.. చిన్ననాటి కోచ్ కోసం భారీ సాయం.. ఎన్ని లక్షలు అంటే

Chinnaswamy Stadium : బెంగళూరు అభిమానులకు బిగ్ షాక్.. చిన్న స్వామి స్టేడియం పై షాకింగ్ నిర్ణయం

Big Stories

×