BigTV English

R Ashwin Biopic : తెరపైకి టీమిండియా క్రికెటర్ అశ్విన్ బయోపిక్… అయ్యే పనేనా?

R Ashwin Biopic : తెరపైకి టీమిండియా క్రికెటర్ అశ్విన్ బయోపిక్… అయ్యే పనేనా?

R Ashwin Biopic : టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) గురించే ప్రస్తుతం ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. బుధవారం ఆయన ఎవ్వరూ ఊహించని విధంగా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి, షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రవిచంద్రన్ అశ్విన్ బయోపిక్ గురించిన చర్చ తెరపైకి వచ్చింది.


ఆస్ట్రేలియాలో సిరీస్ కోసం వెళ్లిన రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) డిసెంబర్ 18న సిరీస్లో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే ఆటకు వీడ్కోలు పలికి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఆయన ఆకస్మిక రిటైర్మెంట్ క్రికెట్ లవర్స్ ని ఆశ్చర్యపరిచింది. ఇక తాజాగా అశ్విన్ బయోపిక్ గురించి చర్చ నడుస్తోంది. నిజానికి రవిచంద్రన్ అశ్విన్ బయోపిక్ గురించిన చర్చ ఇప్పటిది కాదు. 2021 లోనే మొదలైంది. అప్పట్లో పలువురు రాజకీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, అలాగే క్రికెటర్ల బయోపిక్ ల ట్రెండ్ నడిచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్రికెట్ కు సంబంధించి సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని బయోపిక్ లు ఇప్పటికే తెరపైకి వచ్చాయి. అందులో ధోనీ బయోపిక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అయితే ముత్తయ్య మురళీధర్ బయోపిక్ తెరకెక్కుతున్న టైంలోనే ఆర్ అశ్విన్ (R Ashwin) బయోపిక్ కూడా రూపొందబోతుందని ప్రచారం జరిగింది. 2021 లోనే ఈ పుకార్లు షికార్లు చేయగా, ఇందులో అశ్విన్ తో పాటు ధోని పాత్ర కూడా హైలెట్ గా ఉంటుందని టాక్ నడిచింది. ఇక ఈ బయోపిక్ లో అశోక్ సెల్వన్ అనే తమిళ నటుడు నటించబోతున్నాడు అంటూ… అప్పట్లో ఆయన ఇండియన్ జెర్సీ ధరించిన పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ రూమర్లపై అశోక్ సెల్వన్ స్పందిస్తూ ఈ వార్తలన్నీ ఫేక్, అశ్విన్ బయోపిక్ లో నటించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. అదే టైంలో అశ్విన్ కూడా ఆ ట్వీట్ కి రిప్లై ఇచ్చాడు. ఇక ఇప్పుడు గ్రేటెస్ట్ స్పిన్నర్ అయిన అశ్విన్ రిటైర్మెంట్ తో మరోసారి ఆయన బయోపిక్ గురించిన చర్చ నడుస్తోంది. మరి అశ్విన్ బయోపిక్ ఎప్పుడు పట్టలెక్కుతుందో చూడాలి.


ఇదిలా ఉండగా 14 సంవత్సరాలు పాటు భారత క్రికెట్ జట్టులో ఉన్న అశ్విన్ (R Ashwin) టీమిండియా తరఫున మొత్తంగా 106 టెస్ట్ మ్యాచ్ లు ఆడారు. మొత్తంగా చూసుకుంటే 200 ఇన్నింగ్స్ లో 27,246 బంతులు వేసి 537 వికెట్లు తీసి చరిత్ర సృష్టించారు. అనిల్ కుంబ్లే తర్వాత భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా అశ్విన్ క్రికెట్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఒక 116 వన్డేలో 114 ఇన్నింగ్స్ ఆడిన అశ్విన్, 1506 వికెట్లు పడగొట్టి క్రికెట్ లవర్స్ అభిమానాన్ని పొందారు. అలాగే 65 టీ20 మ్యాచ్ లలో టీమిండియా కు ప్రాతినిధ్యం వహించి 72 వికెట్లు పడగొట్టారు. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లో కలిపి 50 కి పైగా వికెట్లు తీసిన టీమ్ ఇండియా బౌలర్ గా నిలిచిన అశ్విన్, తాజాగా గవస్కర్ ట్రోఫీలో భాగంగా రెండు టెస్టులు మిగిలి ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను నిరాశపరిచారు.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×