Sukumar – Sri Tej : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాకి సీక్వల్ గా పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అయింది. అయితే ముందు రోజు చాలా ప్రదేశాల్లో ఈ ప్రీమియర్ షోస్ వేశారు. హైదరాబాద్ సంధ్య థియేటర్లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షో చూడడానికి అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో పాటు వచ్చాడు. ఆ తరుణంలో అల్లు అర్జున్ ని చూడటానికి టికెట్ కొనడం వాళ్లు కూడా సంధ్య థియేటర్ లోపలికి వచ్చేసారు. అక్కడ ఉన్నట్టుండి ఒకసారిగా తొక్కిసలాట జరిగింది. రేవతి అనే ఒక మహిళ అక్కడికక్కడే ఆ తొక్కిసలాటలో పడి మృతి చెందారు. అలానే వాళ్ళ కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతానికి హాస్పిటల్లో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.
ఈ సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేసి చంచల్గూడా జైలుకు తరలించారు. ఒక రాత్రంతా చంచల్గూడా జైల్లో అల్లు అర్జున్ గడిపారు. వాస్తవానికి 14 రోజులు రిమాండ్ విధించిన కూడా మద్యస్థ బెయిల్ రావడం కారణంగా అల్లు అర్జున్ బయటకు వచ్చేసాడు. అయితే అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత చాలామంది సినిమా ప్రముఖులు దర్శకులు హీరోలు అంతా కూడా అల్లు అర్జున్ డైరెక్ట్ గా ఇంటికి వెళ్లి కలిసి పలకరించారు. అలా కలిసిన ప్రతి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ తరుణంలో అల్లు అర్జున్ మీద నెగిటివిటీ మరి కాస్త పెరిగింది. ఒక రాత్రి జైల్లో ఉండి వచ్చినందుకే ఇంతలా తెలుగు సినిమా హీరోలందరూ ఓదారుస్తున్నారు. మరివైపు హాస్పిటల్ లో ఉన్న శ్రీ తేజ్ పరిస్థితి ఏంటి అని సోషల్ మీడియాలో కొంతమంది ట్వీట్లు వేశారు.
Also Read : Sankranthiki Vasthunam: మీనూ సాంగ్.. ఘర్షణ రామచంద్ర గుర్తొచ్చాడు బాసూ
ఇది అల్లు అర్జున్ వరకు చేరడంతో తనకున్న కొన్ని ఆంక్షలు వలన శ్రీ తేజ్ ను కలవడానికి అవ్వలేదు. ఆ పూర్తి బాధ్యతను నేను తీసుకుంటాను అని సోషల్ మీడియా వేదిక రెస్పాండ్ అయ్యాడు. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ ఫాదర్ అల్లు అరవింద్ కూడా హాస్పిటల్ కి వెళ్లి శ్రీ తేజను చూసి వచ్చారు. సుకుమార్ కూడా హాస్పిటల్ కు వెళ్లినట్లు తెలుస్తుంది. తనవంతుగా ఐదు లక్షల రూపాయలను వాళ్లకు అందజేసినట్లు సమాచారం వినిపిస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా మేమున్నాము అంటూ సుకుమార్ ఫ్యామిలీ శ్రీ తేజ్ కు భరోసా ఇచ్చినట్లు తెలుస్తుంది. విద్య వైద్య పరంగా తాము ఇప్పుడు వాళ్లకి నిలబడతామని శ్రీ తేజ్ తండ్రితో సుకుమార్ ఫ్యామిలీ చెప్పినట్లు తెలుస్తుంది.
Also Read : Shiva Raj Kumar: క్యాన్సర్ నిజమే.. ఫ్లోరిడా బయలుదేరిన శివన్న .!