BigTV English

RC-15 : పాట కోసం అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా!

RC-15 : పాట కోసం అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా!

RC-15 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అరవై శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయ్యింది. రీసెంట్‌గా RC 15కి సంబంధించి హైదరాబాద్, రాజమండ్రిలలో షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేశారు. ఇక నెక్ట్స్ షెడ్యూల్‌ను ఇప్పటికే డైరెక్టర్ శంకర్ ప్లాన్ చేసేసుకున్నాడు. ఇక్కడా అక్కడా కాకుండా ఏకంగా తదుపరి షెడ్యూల్‌ను న్యూజిలాండ్‌లో చిత్రీకరించబోతున్నారు. నవంబర్ ఫస్ట్ వీక్‌లో RC 15 షూటింగ్ న్యూజిలాండ్‌లో షూట్ చేయబోతున్నారు.


ఆసక్తికరమైన విషయమేమంటే.. RC 15 కోసం న్యూజిలాండ్‌లో షూట్ చేయబోతున్న పాటను భారీ బడ్జెట్‌తో చిత్రీకరించబోతున్నారు. అంతా ఇంతా బడ్జెట్ కాదు.. ఏకంగా రూ.23 కోట్లతో పాటను చేయబోతున్నారట. ఈ బడ్టెజ్ వింటేనే కళ్లు తిరుగుతున్నాయి కదా. ఓ మీడియం బడ్జెట్ హీరో మూవీ. శంకర్ సినిమా అంటేనే గ్రాండియర్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్. కానీ ఓ పాటకు ఈ మేర ఖర్చు పెట్టడమంటే మామూలు విషయం కాదు.

రామ్ చరణ్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. ఓ పాత్రలో ముఖ్యమంత్రిగా.. మరో పాత్రలో ఎన్నికల అధికారిగా కనిపించబోతున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.


Tags

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×