Hrithik Roshan:సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల మధ్య విడాకులు అనే విషయం కామన్ ముచ్చట. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటీనటులు పెళ్లి చేసుకున్నాక, వైవాహిక బంధం సెట్ కాకపోతే వెంటనే విడాకులు తీసుకుంటారు. పెళ్లి అయి నెల అయిందా.. సంవత్సరం అయిందా..ఆరు నెలలు అయిందా..20 సంవత్సరాల అయిందా.. అనేది గమనించరు. నచ్చితే కలిసి ఉంటారు. నచ్చకపోతే విడాకులు తీసుకుంటారు. ముఖ్యంగా చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. అయితే ఇలా విడాకులు తీసుకున్న చాలా మంది సెలబ్రిటీలు భరణంగా కోట్లకు కోట్ల రూపాయలు ఇస్తూ ఉంటారు. ఇక మన ఇండియాలో ఉన్న సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఈ హీరోవే అత్యంత ఖరీదైన విడాకులట.. అవును, ఈ హీరో తన భార్యను వదిలించుకోవడానికి ఏకంగా వందల కోట్లలో భరణం కింద అప్పజెప్పినట్టు తెలుస్తోంది. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు..? భార్యకి విడాకులు ఇచ్చిన సమయంలో భరణం కింద ఎన్ని కోట్లు ఇచ్చారు? అనేది ఇప్పుడు చూద్దాం.
రిచెస్ట్ విడాకులు ఆ హీరోవే..
బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు టోటల్ ఇండియన్ సినీ హిస్టరీ లోనే ఈ హీరో.. విడాకుల తర్వాత ఇచ్చే భరణంలో రికార్డు కొట్టాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ హీరో తన భార్యతో విడాకుల కోసం ఏకంగా రూ.380 కోట్లను భరణంగా ఇచ్చేసాడట. ఇక ఆ మహానుభావుడు ఎవరో కాదు . బాలీవుడ్ గ్రీకు గాడ్ హృతిక్ రోషన్ (Hrithik Roshan).. బాలీవుడ్ గ్రీక్ గాడ్ అనగానే అందరికీ హృతిక్ రోషన్ మాత్రమే గుర్తుకు వస్తారు. ఒకప్పుడు హృతిక్ రోషన్ ఎంతోమంది అమ్మాయిలతో గ్రీకు గాడ్ అని పిలిపించుకున్నాడు. అయితే అలాంటి హృతిక్ రోషన్ బాలీవుడ్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి, స్టార్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఇక కెరియర్ పీక్స్ లో ఉండగానే తన ప్రియురాలు సుస్సానే ఖాన్(Sussane khan) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదట వీరిద్దరు చాలా రోజులు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.ఇక పెళ్లి చేసుకున్నాక చాలా సంవత్సరాలు ఈ జంట అన్యోన్యంగా ఉంది.కానీ పెళ్లయిన 14 ఏళ్లకు ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
14 ఏళ్ల తర్వాత విడాకులు..
ఇక విడాకులు తీసుకున్న హృతిక్ రోషన్, సుస్సానే ఖాన్ కి రేహాన్,రిధాన్ అనే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఈ క్రమంలోని హృతిక్ రోషన్ తన మాజీ భార్యతో విడాకులు తీసుకోవాలంటే భరణం కింద రూ.400 కోట్లు డిమాండ్ చేసిందట. అయితే ఈ హీరో మాత్రం రూ.20 కోట్లు తగ్గించి, రూ.380 కోట్లు తన మాజీ భార్యకు భరణం కింద అప్పజెప్పాడట. అలా ఇండియన్ సినీ హిస్టరీలోనే హృతిక్ రోషన్ తీసుకున్న విడాకులు రిచెస్ట్ విడాకులు అని, ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో ఉన్న ఏ సెలబ్రిటీ కూడా తమ మాజీ భార్యలకు ఇంత ఎక్కువ మొత్తంలో భరణం ఇవ్వలేదు అంటూ ఈ వార్త ఇప్పుడు బీ టౌన్ లో తెగ వైరల్ అవుతోంది.