Game Changer Leak.. సాధారణంగా ఒక సినిమా అనౌన్స్ చేసింది మొదలు.. రిలీజ్ అయ్యి థియేటర్లలోకి వచ్చి, ఒక నెల గడిచే వరకు నిర్మాతలు తమ సినిమాను కాపాడుకోవాల్సి ఉంటుంది. అప్పుడే పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది. కానీ కొంతమంది చేసే పనుల వల్ల నిర్మాతలకు తీరని నష్టం మిగులుస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే దాదాపు రూ.450 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి, దాదాపు మూడు సంవత్సరాల పాటు నిర్విరామంగా కష్టపడి, ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది గేమ్ ఛేంజర్ (Game Changer). జనవరి 10వ తేదీన అనగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, అలా థియేటర్లలోకి వచ్చిందో లేదో అప్పుడే కొంతమంది కేటుగాళ్లు హెచ్డి ప్రింట్ ఆన్లైన్లో లీక్ చేయడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పైరసీ బారిన పడ్డ గేమ్ ఛేంజర్..
ముఖ్యంగా ఈ విషయం నిర్మాతల వరకు వెళ్లిందో లేదో తెలియదు కానీ ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. అసలు నిందితులను పట్టుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. కనీసం 24 గంటలు కూడా పూర్తి కాకముందే పైరసీ వెంటాడింది. ఈ సినిమా మొత్తం హెచ్డి ప్రింట్ లో అందుబాటులోకి రావడంతో ఇది హార్ట్ బ్రేకింగ్ అంటూ సినీ వర్గాలు సైతం పైరసీని ఖండిస్తూ ట్వీట్స్ చేస్తున్నాయి. మరి ఇది నిర్మాతల వరకు వెళ్తే మేకర్స్ దీనిపై ఎలా స్పందిస్తారో? ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో? తెలియాల్సి ఉంది.
గేమ్ ఛేంజర్ సినిమా విశేషాలు..
గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే.. ప్రముఖ క్రియేటివ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan)హీరోగా నటించిన చిత్రం ఇది. ఈ చిత్రానికి శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు దాదాపు రూ.450 కోట్లకు పైగా ఖర్చుపెట్టి నిర్మించారు. అంతేకాదు ఈ సినిమాలో కేవలం నాలుగు పాటల కోసమే రూ.75 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, యావరేజ్ టాక్ తెచ్చుకుంటోంది. దీనికి తోడు మెలోడీ సాంగ్ గా యూట్యూబ్లో మిలియన్స్ వ్యూస్ సంపాదించిన ‘నానా హైరానా’ పాటను తొలగించడం పై అభిమానులు సైతం హర్ట్ అవుతున్నారు. అయితే ఈ విషయంపై స్పందించిన మేకర్స్ థియేటర్లలో టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోయిందని, ఖచ్చితంగా జనవరి 14వ తేదీ నుంచి సినిమాలో ఈ పాట యాడ్ అవుతుందని కూడా తెలిపారు. ఇక ఇందులో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. కియారా అద్వాని (Kiara advani), అంజలి(Anjali ), ఎస్ జె సూర్య (SJ.Surya), శ్రీకాంత్ (Srikanth), సునీల్(Suneel ) తదితరులు భాగమయ్యారు. అంతేకాదు ఈ సినిమాలో రామ్ చరణ్ మినహా మొత్తం 17 మంది హీరోలు నటించడం సినిమాకి మరో ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఏది ఏమైనా భారీ తారాగణం మధ్య వచ్చిన ఈ సినిమా పై శంకర్ మార్క్ చూపించలేదని స్పష్టం అవుతుంది. మరి ఈ సినిమాకు కలెక్షన్లు ఏ విధంగా వస్తాయో చూడాలి.