BigTV English
Advertisement

Renu Desai : వాళ్ళు ఖచ్చితంగా నరకానికే వెళ్తారు… అలాంటి పనులు చేసే వాళ్ళపై రేణు దేశాయ్ ఫైర్

Renu Desai : వాళ్ళు ఖచ్చితంగా నరకానికే వెళ్తారు… అలాంటి పనులు చేసే వాళ్ళపై రేణు దేశాయ్ ఫైర్

Renu Desai : రేణు దేశాయ్ ఏం చేసినా సరే అది క్షణంలో వైరల్ అవుతుంది. తాజాగా ఆమె ‘అలాంటి పనులు చేసే మీకు ఖచ్చితంగా నరకమే దిక్కు’ అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్ చేసిందో తెలుసుకుందాం పదండి.


ఏ తల్లి సంతోషిస్తుంది ?

రేణు దేశాయ్ సినిమాలో పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా బయట జరిగే ఏ విషయంపైనైనా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తుంది. ఇక ఈ అమ్మడు జంతు ప్రేమికురాలు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె ఇంట్లో పిల్లల్ని పెంచుకోవడమే కాదు కుక్కల వైద్యం కోసం విరాళాలు ఇవ్వడం, సేకరించడం లాంటి పనులు కూడా చేస్తుంది. ముఖ్యంగా పెట్స్ కోసం పని చేసే పలు స్వచ్ఛంద సంస్థలకు తన వంతుగా సాయం చేసి మూగజీవుల బాధను తగ్గించడానికి ఎప్పుడూ ముందుంటుంది. అయితే జంతు బలి అనేది ప్రస్తుతం సమాజంలో ఒక మూఢ నమ్మకంలా మారింది. ఏం మొక్కుకున్నా సరే జంతు బలి ఇస్తేనే దేవుళ్ళు తమను చల్లగా చూస్తారని భావించే వారి సంఖ్య భారీగానే ఉంది. ఈ విషయంలో తాజాగా రేణు దేశాయ్ తాజాగా అగ్గిమీద గుగ్గిలం అయింది.


కొందరు అఘోరాలు చేసిన జంతు బలి వీడియోను షేర్ చేస్తూ ఫైర్ అయింది రేణు దేశాయ్. తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో కొందరు అఘోరాలు దేవతకి మూగ జీవాలను బలిస్తున్న వీడియోను చూసి కలత చెందింది. ఆ వీడియోను షేర్ చేస్తూ ‘ఇలా బలిచ్చి, మూగజీవాలను చంపేస్తే ఏ దేవత, దేవుడు సంతోషిస్తాడని ఈ పిచ్చి జనాలు నమ్ముతున్నారు?’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. ‘బిడ్డల రక్తం కళ్ల చూసి ఏ తల్లి సంతోషిస్తుంది? ఇలాంటి పనులు చేసే వారికి తప్పకుండా నరకంలో చోటు దక్కుతుంది’ అంటూ తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో పలువురు రేణు దేశాయ్ కి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా ‘దేవర’ మూవీ సెలబ్రేషన్స్ లో భాగంగా కూడా కొందరు ఇలా మూగ జీవాలను బలి ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

స్ట్రాంగ్ వార్నింగ్

పెట్స్ గురించి నిత్యం ఏదో ఒక పోస్ట్ పెట్టే రేణు దేశాయ్ ఎక్కడ పెట్స్ కు హెల్ప్ కావలసి వచ్చినా తనవంతు సాయం చేస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో తనమీద వచ్చే ఎలాంటి నెగెటివిటీనైనా ధైర్యంగా ఎదుర్కొని ధీటుగా సమాధానం చెబుతుంది. ఇక తన మీద వచ్చే ట్రోలింగ్ అయితే భరిస్తుంది కానీ తన పిల్లలు అఖీరా, ఆద్యలని ఎవరైనా టార్గెట్ చేస్తే అస్సలు ఊరుకోదు. అంతేకాకుండా ఎవరైనా తన పిల్లల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది రేణు దేశాయ్. అయితే గత కొన్ని రోజులుగా రేణు వివడాలకు దూరంగా ఉంటూ వస్తోంది. మరోవైపు పవన్ ఫ్యాన్స్ కూడా ఆమెపై ఇంతకుముందులా నెగెటివ్ కామెంట్స్ చేయట్లేదు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×