Big Stories

AP Election Betting: ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు.. వైసీపీ పిచ్చితో రోడ్డున పడ్డ..

- Advertisement -

కడప జిల్లాలో వైసీపీలో రాజకీయంగా తలపండిన వారు.. ఈ సారి వ్యూహాత్మకంగా టీడీపీపై పందేలు కట్టి డబ్బులు సంపాదించుకున్నారు. మిగతా వారు వైసీపీపై పిచ్చితో పందేలు కాసి దారుణంగా నష్టపోయారట. జనమంతా ఈ సారి టీడీపీకి జై కొట్టారు. కేవలం వైసీపీ నేతలు కొన్ని ఫేక్ సర్వేలు సృష్టించి మళ్లీ మేమే గెలుస్తామంటూ లేనిపోని ఆశలు కల్పించారు. కొద్దో గొప్పో పేరున్న ఆరామస్తాన్ సర్వేను ఈ నెల 1న జనాల్లోకి వదిలారు. అంతకు ముందే పోలింగ్ తర్వాత తనకు పెయిడ్ సలహాలు ఇచ్చి గైడ్ చేసిన ఐ ప్యాక్ టీంని అభినందించడానికి వెళ్లిన జగన్.. ఆ టీంతో సెల్ఫీలు దిగి. 2019కి మించి చరిత్ర సృష్టించబోతున్నామని ఘనంగా ఇంగ్లీషులో ప్రకటించారు.

- Advertisement -

ఆ తర్వాత ఆరా సంస్థ సర్వే మళ్లీ వైసీపీ గెలుస్తుందని చెప్పుకొచ్చింది. పోలింగ్ తర్వాత జగన్ ధీమా, తర్వాత ఆరాతో పాటు కొన్ని అనామక సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌తో కడప జిల్లాలోని వైసీపీ వీరాభిమానులు మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో కోట్లాది రూపాయలు పందేలు కట్టి చేతులు కాల్చుకున్నారట. పులివెందులలో జగన్, బద్వేలులో ఎమ్మెల్యే సుధ మెజార్టీపై కొందరు పందేలు సాగాయి. ఇంకొన్ని చోట్ల కూటమి అధికారంలోకి వస్తుందని, ఎమ్మెల్యేపై పందేలు కాశారు. జగన్ మెజార్టీపై జోరుగా బెట్టింగులు కట్టిన వారు ఈ సారి మెజార్టీ తగ్గడంతో జేబులు గుల్ల చేసుకున్నారంట

Also Read: కొండపి రికార్డు.. ఒక నియోజకవర్గం.. నలుగురు ఎమ్మెల్యేలు

వైనాట్ వన్ సెవెన్టీ ఫైవ్ అన్న జగన్ తామే మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తే.. ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా కనీసం 110 సీట్లతో అయినా పగ్గాలు చేపట్టబోతున్నామని తెగ ప్రకటించుకున్నారు. ఇక బొత్స , సజ్జల వంటి వారైతే ప్రమాణస్వీకార ముహర్తం, వేదికలు కూడా ప్రకటించారు. వైసీపీ సోషల్ మీడియా కూడా కౌంటింగ్ ముగిసే వరకు అదే ఊదరగొట్టింది. దాంతో సీట్లు తగ్గినా సరే మళ్లీ జగనే సీఎం అవుతారని నమ్మి పలువురు పందేలు కాశారు.

కడపలో మళ్లీ అంజాద్ బాషానే గెలుస్తారని పందేలు కట్టగా, మరికొందరు జగన్ దే అధికారం అని పందెం కట్టారట… కడపలో ఫైనాన్షియర్‌ అయిన ఒక వైసీపీ నేత ఏకంగా ఏడు కోట్లు పోగొట్టుకున్నారంట. అంఙాద్ బాషా గెలుస్తారంటూ ఒకరు కోటి పెట్టి చేతులు కాల్చుకున్నారట. ఒక కార్పొరేటరు మళ్లీ జగనే సీఎం అంటూ అప్పు చేసి 30 లక్షలు పెట్టినట్లు చెబుతారు. మరో కార్పోరేటరు ఎంపీ అవినాష్‌రెడ్డికి లక్షన్నర మెజార్టీ దాటుతుందని 30 లక్షలు పందెం కాశారంట. గత ఎన్నికల్లో 3 లక్షల 80 వేల మెజార్టీ సాధించిన జగన్ తమ్ముడి మెజార్టీ ఈ సారి 62 వేలకే పరిమితమవ్వడంతో ఆ కార్పొరేటర్ లబోదిబోమంటున్నాడు.

మరోవైపు వైసీపీకి చెందిన కీలక నేత అంఙాద్ బాషా గెలుస్తాడని 2 కోట్లు పందెం కాసి చేతులు కాల్చుకున్నాడంట. కడపలో అంజాద్ బాషా మళ్లీ గెలుస్తాడని, ఎంపీ అవినాష్ కు లక్షన్నర మెజార్టీ దాటు తుందని జిల్లాలో దాదాపు వందకోట్ల మేర పందాలు జరిగినట్లు తెలుస్తోంది. పులివెందులలో జగన్ మెజార్టీపై ఈ సారి భారీ ఎత్తున బెట్టింగ్ సాగింది. ఎంతలా అంటే ఈ సారి పులివెందులలో లక్ష ఓట్లతో జగన్ గెలుస్తా రన్నది వైసీపీ నేతల అంచనా.. అయితే 70 వేల కు మించదని బెట్టింగ్ సాగింది… దీంతో జగన్ వైపు ఒకటికి ఒకటిన్నర చొప్పున భారీ ఎత్తున బెట్టింగ్ పెట్టారట… కడపలో ఓ నేత జగన్ 70 వేలు మెజార్టీ దాటుతుందని రూ.3 కోట్లు పందెం కట్టగా, మరికొందరు వ్యాపారస్తులు బ్యాచ్చులుగా ఏర్పడి ఐదు కోట్లు బెట్టింగ్ కట్టారట.

Also Read: బాలినేని జంప్..? పార్టీ మారేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం..? జనసేన కేనా..?

వైసీపీ కేడరులో చిన్నచితకా వారు కూడా జగన్ మెజార్టీపై భారీగా పందేలు కాశారని చెబుతున్నారు. ఆ మెజార్టీకి సంబంధించి వంద కోట్లకు పైగా బెట్టింగ్ జరిగినట్లు సమాచారం. అయితే జగన్ మెజార్టీ గతం కంటే 30 వేలు తగ్గి 61.6 వేలకే పరిమితం అవ్వడంతో పందేలు వేసిన వారి కొంపకొల్లేరైంది. ఇక బద్వేలులో కూడా వైసీపీ ఎమ్మెల్యే మెజార్టీ 20 వేలు దాటుతుందంటూ భారీగా పందేలు కాశారు. ఇక్కడ సుమారు 50 కోట్లపైన బెట్టింగ్ జరిగిందట. పోరుమామిళ్లలో 30 కోట్ల మేర బెట్టింగ్ కాసినట్లు వినికిడి వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది.

చంద్రబాబు సీఎం అంటూ ఓ బడా ఆసామి రూ.7 కోట్లు పందెం పెట్టి గెలిచినట్లు చెప్తున్నారు. అలాగే ఓ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో ఉన్నప్పటికీ టీడీపీ గెలుస్తుందంటూ పందెం కాసి 3 కోట్లు గెలిచారంటారట. బెట్టింగ్ అడ్డాగా పేరున్న ప్రొద్దుటూరులో ఓ వైసీపీ నేత రాష్ట్రంలో కూటమిదే అధికారం అంటూ పందెం కాసి పదికోట్లు గెలిచారంట. జమ్మలమడుగులో బీజేపీ పోటీ చేయడంతో వైసీపీనే గెలుస్తుందని కొందరు వైసీపీ నేతలు పందేలు కాసి 20 కోట్ల మేర పొగొట్టుకున్నారట. కమలాపురం లో మళ్లీ వైసీపీనే గెలుస్తుందని కొందరుభారీ ఎత్తున పందెం కట్టారంటారట. ఇక్కడ సుమారు 50 కోట్లకు పైగా బెట్టింగ్ జరిగిదంటున్నారు

ఇక మైదుకూరులో మళ్లీ వైసీపీ అని కొందరు మోసపోయి పందేలు కాసి డబ్బులు పోగొ ట్టుకున్నారట. మొత్తమ్మీద జిల్లా వ్యాప్తంగా వైసీపీ వీరాభిమానులు 500 కోట్లకు పైగానే డబ్బులు పోగొట్టుకున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారంతో కడప జిల్లాలోని చోట మోటా వైసీపీ నేతలు పలువురు జిల్లా వదిలే పరిస్థితి ఏర్పడింది. ఆ క్రమంలో వైసీపీ మమ్మల్ని నట్టేట ముంచేసిందని దుమ్మెత్తి పోస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News