Renu Desai: ఇప్పటికీ రేణు దేశాయ్‌కు పవన్ కళ్యాణ్ మాజీ భార్య అనే అంటుంటారు. అలా అనడం తనకు నచ్చకపోయినా ప్రేక్షకులను ఆపడం తన వల్ల కాలేదు. అందుకే తను కూడా లైట్ తీసుకుంది. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. అంతే కాకుండా తనను విమర్శించే వారికి ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ కౌంటర్లు కూడా ఇస్తుంది. ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే కాదు పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను కూడా ఎవరికీ భయపకుండా షేర్ చేసుకుంటుంది రేణు. దానివల్ల తనకు నెగిటివిటీ వచ్చినా పెద్దగా పట్టించుకోదు. ఇక తాజాగా ఆరేళ్ల తర్వాత విజయవాడ వచ్చింది. దానికి సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
విజయవాడలో రేణు
విజయవాడలో ల్యాండ్ అవ్వగానే ఆ విషయాన్ని తన ఫాలోవర్స్‌తో పంచుకుంది రేణు దేశాయ్. ‘ఆరేళ్ల తర్వాత విజయవాడ వచ్చాను’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో విజయవాడలోనే తన ఫ్యాన్స్ అంతా తనకు వెల్‌కమ్ చెప్తున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ సినిమాలు చేయకపోయినా.. ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నా.. ఒకప్పుడు తను చేసిన సినిమాలు మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో తన పెయిర్ చాలామందికి ఫేవరెట్. అలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన రేణు దేశాయ్.. తాజాగా విజయవాడకు వచ్చినా ఎందుకు వచ్చిందనే విషయం బయటికొచ్చింది.
Also Read: బాలయ్య పాటకు నెగిటివ్ రెస్పాన్స్.. అసలు ఏంటిది మాస్టారు.?
ఆ కార్యక్రమం కోసమే
దేశంలోనే తొలి మహిళా టీచర్ అయిన సావిత్రిబాయ్ పులే జయంతి వేడుకల్లో పాల్గొనడానికి రేణు దేశాయ్ (Renu Desai) విజయవాడ వచ్చినట్టు తెలుస్తోంది. జనవరి 4న విజయవాడలో ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. అందుకే ఈ వేడుకల కోసం రేణు దేశాయ్‌కు స్పెషల్‌గా ఆహ్వానం అందింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడం కోసమే నేరుగా కాశి నుండి విజయవాడ వెళ్లిపోయింది రేణు. ప్రస్తుతం కాశీలో తన ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. అదే సమయంలో విజయవాడలోని ఈవెంట్‌కు గెస్ట్‌గా ఆహ్వానం రావడంతో వెంటనే అక్కడికి వెళ్లింది. మరి ఈ కార్యక్రమానికి రేణు దేశాయ్ ఒక్కరే హాజరవుతారా? కుటుంబ సభ్యులతో వెళ్తుందా అనేది తెలియాల్సి ఉంది.
వారసులపై దృష్టి
ప్రస్తుతం రేణు దేశాయ్ తన పర్సనల్ లైఫ్‌లోనే చాలా బిజీ అయిపోయింది. మళ్లీ ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన కూడా తనకు లేదని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. తనకు మాత్రమే కాదు.. తన పిల్లలకు కూడా ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీపై ఆసక్తి లేదని తెలిపింది. పవన్ కళ్యాణ్, రేణు వారసుడు అయిన అకిరా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తండ్రికి తగిన వారసుడు అని నిరూపించుకుంటాడని అందరూ భావించారు. కానీ అకిరాకు అసలు ఆ ఆలోచనే లేదని రేణు దేశాయ్ ముక్కుసూటిగా చెప్పేసింది. కానీ అకిరా మాత్రం తన తండ్రి పవన్‌తో కలిసి ‘ఓజీ’లో నటించడానికి సిద్ధమయ్యాడు. దానికి సంబంధించిన షూటింగ్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.