Dabidi Dibidi Song: కమర్షియల్ చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్ అనేవి చాలావరకు ఆ సినిమాకు ప్రేక్షకుల్లో రీచ్ ఎక్కువగా వచ్చేలా చేస్తాయి. ఒక మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఐటెమ్ సాంగ్ రిలీజ్ చేయగానే కచ్చితంగా ఆ పాట గురించి, ఆ సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవడం మొదలుపెడతారు. అలాగే సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ‘డాకు మహారాజ్’ మూవీ నుండి కూడా ఒక ఐటెమ్ సాంగ్ విడుదలయ్యింది. అదే ‘దబిడి దిబిడి’. ఇటీవల ఈ సాంగ్‌కు సంబంధించిన లిరికల్ వీడియో విడుదలయ్యింది. విడుదలయినప్పటి నుండి ఈ పాటకు, అందులోని స్టెప్పులకు నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అసలు ఏంటిది మాస్టారు అంటూ శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీపై విమర్శలు వినిపిస్తున్నాయి.
నెగిటివ్ రెస్పాన్స్
బాలకృష్ణ (Balakrishna) హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj) మూవీ సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమయ్యింది. అందుకే ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు మేకర్స్. అందులో భాగంగానే తాజాగా ఇందులో నుండి ‘దబిడి దిబిడి’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటలో ఊర్వశి రౌతెలా (Urvashi Rautela).. బాలయ్యతో కలిసి స్టెప్పులేసింది. ఈ సాంగ్ విడుదల కాకముందు దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. విడుదలయిన తర్వాత కూడా దీనికి పాజిటివ్ రెస్పాన్సే లభించింది. కానీ లిరికల్ వీడియోకు మాత్రమే విపరీతమైన నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దానికి కారణం బాలయ్య, ఊర్వశి కలిసి వేసిన స్టెప్పులే. వాటిపై ప్రేక్షకులు రకరకాల కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
Also Read: బెయిల్ తర్వాత ఫస్ట్ టైమ్ జనసేన పార్టీ పై స్పందించిన జానీ మాస్టర్.. ఏమన్నారంటే..?
బాలయ్య కష్టం
మామూలుగా సినిమాల్లో బాలయ్య వేసే స్టెప్పులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ వయసులో కూడా ఆయన అద్భుతంగా డ్యాన్స్ చేస్తారని ఆయన ఫ్యాన్స్ మురిసిపోతుంటారు. కానీ దానికి చాలావరకు క్రెడిట్ కొరియోగ్రాఫర్స్‌కు కూడా వెళ్లాల్సిందే. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా వారు స్టెప్స్ కంపోజ్ చేస్తేనే అవి స్క్రీన్‌పై అందంగా కనిపిస్తాయి. కానీ ‘దబిడి దిబిడి’ విషయంలో అలా జరగలేదు. ఊర్వశి రౌతెలా స్పీడ్‌ను మ్యాచ్ చేస్తూ డ్యాన్స్ చేయడానికి బాలయ్య కష్టపడ్డారేమో అని పాట చూసిన చాలామంది ప్రేక్షకులు ఫీలయ్యారు. పైగా ఒఖ సీనియర్ హీరో అయ్యిండి హీరోయిన్‌తో అలాంటి స్టెప్పులు వేయడం కరెక్ట్ కాదని మరికొందరు ఫీలవుతున్నారు.
మాస్టర్ బాధ్యత
ప్రస్తుతానికి ‘దబిడి దిబిడి’కి సంబంధించిన లిరికల్ వీడియో మాత్రమే బయటికొచ్చింది. అయినా అందులో ఉన్న కొన్ని స్టెప్స్‌కే దానిపై అంత నెగిటివిటీ వచ్చేసింది. ఇక ఫుల్ వీడియో సాంగ్ విడుదలయితే ఇంకా ఏ రేంజ్‌లో నెగిటివిటీ వస్తుందో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సీనియర్ హీరోల బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా స్టెప్స్ కంపోజ్ చేయడం డ్యాన్స్ మాస్టర్ బాధ్యత అంటూ చాలామంది ప్రేక్షకులు శేఖర్ మాస్టర్‌పై విమర్శలు కురిపిస్తున్నారు. మొత్తానికి ఒక రేంజ్‌లో రెస్పాన్స్ అందుకుంటుందని ‘దబిడి దిబిడి’ పాటను విడుదల చేసిన మేకర్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది.