BigTV English

IND vs AUS Test: బెడిసికొట్టిన గంభీర వ్యూహం.. టీమిండియా ఆలౌట్.. స్కోర్ ఎంతంటే ?

IND vs AUS Test: బెడిసికొట్టిన గంభీర వ్యూహం.. టీమిండియా ఆలౌట్.. స్కోర్ ఎంతంటే ?

IND vs AUS Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు అతి తక్కువ పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. భారత టాప్ ఆర్డర్ మరోసారి విఫలం కావడంతో కేవలం 185 పరుగులకే కుప్పకూలింది భారత జట్టు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ (40) మినహా మిగతా బ్యాటర్లందరూ చేతులెత్తేశారు.


Also Read: Virat – Nana Patekar: కోహ్లీ కోసం పాస్టింగ్‌ చేస్తున్న సీనియర్‌ నటుడు..!

యశస్వి జైస్వాల్ (10), రాహుల్ (4), విరాట్ కోహ్లీ (17) గిల్ (20), జడేజ (26), నితీష్ కుమార్ రెడ్డి (0), వాషింగ్టన్ సుందర్ (14), ప్రసిద్ద్ కృష్ణ (3), బూమ్రా (22), మహమ్మద్ సిరాజ్ (3) పరుగులు చేశారు. చివరి ఓవర్ లో బూమ్రా ధాటిగా ఆడాడు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4 వికెట్లతో రాణించగా.. మిచెల్ స్టార్క్ 3, పాట్ కమీన్స్ 2, నాథన్ లైయన్ ఒక వికెట్ పడగొట్టారు.


సిడ్నీ వేదికగా జరిగే ఈ ఐదవ టెస్ట్ నుండి కెప్టెన్ రోహిత్ శర్మ తప్పుకోగా.. బూమ్రా జట్టుకి నాయకత్వం వహిస్తున్నాడు. అయితే గాయం కారణంగా బౌలర్ ఆకాష్ దీప్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. ఇక టాస్ గెలిచిన బూమ్రా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కి దిగిన భారత బ్యాటర్లకు ఆస్ట్రేలియా బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (4), యశస్వి జైస్వాల్ (10) పరుగులకే అవుట్ అయ్యారు.

ఆ తరువాత రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన గిల్ (20) పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ (17) పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు. లంచ్ విరామం తర్వాత భారత జట్టు 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు రిషబ్ పంత్. బాల్స్ నేరుగా వచ్చి శరీరానికి తాకుతున్నప్పటికీ ధైర్యంగా ఎదుర్కొంటూ 40 పరుగులు జోడించాడు. ఇక బోలాండ్ బౌలింగ్ లో కమీన్స్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

Also Read: Gautham Gambhir: గంభీర్ కు చుక్కలు చూపిస్తున్న ఫ్యాన్స్‌… #RIP Gambhir అంటూ !

ఇక గత మ్యాచ్ లో సెంచరీ చేసిన నితీష్ రెడ్డి డక్ అవుట్ కావడం జట్టును మరింత దెబ్బతీసింది. ఆ తర్వాత వచ్చిన ఆల్రౌండర్లు జడేజా, వాషింగ్టన్ సుందర్ కూడా పెద్దగా రాణించలేకపోయారు. చివర్లో బూమ్రా మూడు ఫోర్లు, ఓ సిక్స్ తో కాసేపు ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొన్నాడు. 17 బంతులలో బూమ్రా 22 పరుగులు చేశాడు. కాగా కమీన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో విఫలమైన భారత బ్యాటర్లని క్రికెట్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక 185 పరుగులు టీమిండియా చేయగా…తన మొదటి ఇన్నింగ్స్ ని ప్రారంభించింది ఆస్ట్రేలియా. కానీ భారత జట్టు కెప్టెన్ జస్ ప్రీత్ బూమ్రా ఆస్ట్రేలియా జట్టుకు షాక్ ఇస్తూ రెండవ ఓవర్ చివరి బంతికి వికెట్ పడగొట్టాడు. రెండు పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజాని పెవిలియన్ చేర్చాడు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 9 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×