BigTV English

Pushpa2 : బన్నీ రాకుంటే నా భార్య బ్రతికేది.. కన్నీళ్లు పెట్టిస్తున్న మృతురాలి భర్త వ్యాఖ్యలు..

Pushpa2 : బన్నీ రాకుంటే నా భార్య బ్రతికేది.. కన్నీళ్లు పెట్టిస్తున్న మృతురాలి భర్త వ్యాఖ్యలు..

Pushpa2 :  పుష్ప.. పుష్ప.. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప 2 మేనియా కొనసాగుతుంది. గత మూడేళ్లు గా ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేశారు. అల్లు అర్జున్ ను స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఫ్యాన్స్ కోరిక నేటితో తీరిందనే చెప్పాలి. ఇవాళ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది. రాత్రి ప్రీమియర్ షోలకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా సినిమా పై రియాక్ట్ అవుతున్నారు. సినిమా గురించి తమ అభిప్రాయాలను నెట్టింట పంచుకున్నారు. తమ అభిమాన హీరో సినిమా విడుదలయిందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సినిమాను చూసేందుకు థియేటర్ల వద్ద పుష్ప రాజ్ అభిమానులు బారులు తీరారు.. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర పరిస్థితి ఊహించలేరని చెప్పాలి. నిన్న రాత్రి అక్కడ ప్రీమియర్ షోలు పడ్డాయి. ఆ సమయంలో అక్కడకు హీరో అల్లు అర్జున్ రావడంతో తమ హీరోను చూసేందుకు అభిమానులు పరుగులు తియ్యడంతో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఒక బాలుడు స్పృహ తప్పి పడిపోయాడు. అలాగే మరో ఇద్దరికి గాయాలు తగిలాయాని తెలుస్తుంది. తాజాగా ఈ ఘటన పై మృతి చెందిన మహిళ భర్త స్పందించారు. ఆయన మాట్లాడిన మాటలు అందరికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


అల్లు అర్జున్ నటించిన పుష్ప2 ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో చూసేందుకు వెళ్లిన వివాహిత రేవతి మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం అవుతోంది.. రేవతి మృతి చెందగా, ఆమె కొడుకు శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్‌ షో చూసేందుకు రేవతి, ఆమె భర్త భాస్కర్‌, ఇద్దరు పిల్లలు శ్రీతేజ్‌, సన్వీక లు దిల్‌సుఖ్‌ నగర్‌ నుంచి సంధ్య థియేటర్‌కు వచ్చారు. కొత్త సినిమాల రిలీజ్ అవుతున్నాయంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడం కష్టమే. ఇప్పుడు అలాంటి పరిస్థితి నెలకొందని తెలుస్తుంది. అల్లు అర్జున్ సినిమాలకు ఉన్న క్రేజ్ ఇదే.. ఇక జనాలను చూసేందుకు అల్లు అర్జున్ అక్కడికి రావడంతో ఫ్యాన్స్ ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగిందని తెలుస్తుంది. భార్యను పోగొట్టుకున్న భాస్కర్‌ మీడియా ముందుకు వచ్చి పలు విషయాలను వెళ్లడించారు.

మృతి చెందిన రేవతి భర్త భాష్కర్ మీడియాతో మాట్లాడుతూ.. మా బాబు శ్రీతేజ చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్‌కి అభిమాని. అందరూ మా వాడిని పుష్ప అని పిలుస్తూ ఉంటారు. వాడు కోరడంతోనే మేము అంతా పుష్ప 2 సినిమాను చూడటం కోసం సంధ్య థియేటర్‌కి వెళ్లాము. సినిమా కోసం వెళ్లిన మేము రేవతిని కోల్పోవడం తట్టుకోలేక పోతున్నాను. పోలీసులు CPR చేసినపుడు మా బాబు స్పృహలోకి వచ్చాడు. వెంటనే అక్కడ నుంచి పోలీసు వారి సహాయంతో ఆసుపత్రికి తీసుకు వెళ్లాం. కానీ రేవతి అప్పటికే మృతి చెందినట్లుగా డాక్టర్లు చెప్పారు. పుష్ప 2 సినిమా చూడ్డానికి వెళ్లిన మాకు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం తట్టుకోలేక పోతున్నాను భాస్కర్ అన్నారు.


సంధ్య థియేటర్‌లోకి మొదట నా భార్య పిల్లలు వెళ్లారు. ఆ సమయంలో అభిమానులు తక్కువగానే ఉన్నారు. ఎప్పుడైతే అల్లు అర్జున్‌ వచ్చారని తెలిసిందో అప్పుడు జనాలు విపరీతంగా పెరిగారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో నా భార్య, బాబు జనాల మధ్య నలిగి పోయారు. ప్రస్తుతం బాబు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమా చూసేందుకు వెళ్లి చనిపోవడం బాధగా ఉందని ఆయన కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఈ అభిమానులు చనిపోయిన ఘటన పై అల్లు అర్జున్ స్పందిస్తారేమో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×