BigTV English

Richa Chadha: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ‘షకీలా’ బ్యూటీ

Richa Chadha: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ‘షకీలా’ బ్యూటీ

Richa Chadha: బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఆమె మంగళవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపింది. నటుడు అలీ ఫజల్ మరియు రిచా చద్దా 2020 కరోనా లాక్ డౌన్ సమయంలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.


ఈ ఏడాది ఫిబ్రవరిలో రిచా, అలీ తాము త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలిపారు. ఈ మధ్యనే రిచా బేబీ బంప్ ఫొటోస్ ను షేర్ చేస్తూ.. బిడ్డ కోసం వేచి ఉండలేకపోతున్నామని రాసుకొచ్చింది.ఇక జూలై 16 న ఈ జంట ఇంట మహాలక్ష్మీ పుట్టింది. ఈ విషయాన్నీ తెలుపుతూ ఈ జంట ఎమోషనల్ అయ్యారు.

“16.07.24న ఆరోగ్యకరమైన ఆడ శిశువు రాకను ప్రకటించినందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాం. మా కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి. మా శ్రేయోభిలాషులకు వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు ధన్యవాదాలు.. ప్రేమతో రిచా చద్దా మరియు అలీ ఫజల్” అంటూ రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.


ఇకపోతే రిచా చద్దా 2013లో “ఫుక్రే” సినిమాలో మొదటిసారి కలిసి పనిచేశారు. అప్పటినుంచే వీరిమధ్య ప్రేమాయణం మొదలయ్యింది. 2016లో తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు. అలీ ఫజల్.. ఎక్కువ మీర్జాపూర్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. గుడ్డు భాయ్ గా ఆయన నటనకు తెలుగువారు కూడా ఫిదా అయ్యారు.

ఇక రిచా కూడా తెలుగువారికి సుపరిచితమే. శృంగార తార షకీలా బయోపిక్ లో ఆమె షకీలా పాత్రలో నటించి మెప్పించింది. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×