BigTV English

Genelia D’Souza :మళ్లీ తల్లి కాబోతున్న జెనీలియా.. ముచ్చటగా మూడోసారి!

Genelia D’Souza :మళ్లీ తల్లి కాబోతున్న జెనీలియా.. ముచ్చటగా మూడోసారి!

Janelia: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో తన నటనతో ప్రేక్షకులను తెప్పించి మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి జెనీలియా (Janelia) ఒకరు. ఈమె సత్యం అనే సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇలా సత్యం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె అనంతరం సాంబ, నా అల్లుడు, బొమ్మరిల్లు, సై, హ్యాపీ వంటి పలు సినిమాలలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు. ఇక జెనీలియా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఈమె నటుడు రితేష్ దేశముఖ్ (Ritesh Deshmukh)అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.


మరోసారి తల్లి కాబోతున్న నటి…

జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ 2012వ సంవత్సరంలో పెద్దల అంగీకారంతో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరి వివాహం హిందూ, మరాఠీ అలాగే క్రైస్తవ సాంప్రదాయ పద్ధతిలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లి తర్వాత ఈమె సినిమాలలోకి రాలేదు కానీ, ఈ దంపతులు రియాన్ (Riyan), రహిల్ (Rahil) అనే ఇద్దరు కుమారులకు జన్మనివ్వడంతో ఇండస్ట్రీకి కొంతకాలం పాటు దూరమయ్యారు. ఇక ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. పలు ప్రాజెక్టులకు కూడా జెనీలియా కమిట్ అయ్యారు.


మూడవ బిడ్డకు స్వాగతం…

ఇదిలా ఉండగా గతంలో జెనీలియా మూడోసారి తల్లి కాబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఈ వార్తలను ఈ జంట ఇద్దరు పూర్తిగా ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా తాము అలాంటి ఆలోచనలో లేమని తెలియజేశారు. అయితే తాజాగా జెనీలియా భర్త రితేష్ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఒక ఫోటో చూస్తే మాత్రం వీరు త్వరలోనే తమ మూడవ బిడ్డకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టమవుతుంది. రితేష్, జెనీలియా బేబీ బంప్ తో ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఇలా బేబీ బంప్(Baby Bump) తో ఉన్న జెనీలియాను వెనుక నుంచి రితేష్ హగ్ చేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇక ఈ ఫోటోని రితేష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ స్పెషల్ వన్ అంటూ లవ్ ఎమోజిలను జోడించారు. దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఈ దంపతులు కూతురి కోసం ఎదురుచూస్తున్నారు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం మరోసారి ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నందుకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.. ఇప్పటికే ఇద్దరు అబ్బాయిలకు జన్మనిచ్చిన జెనీలియా మళ్లీ గర్భం దాల్చడంతో కచ్చితంగా ఈ దంపతులకు కుమార్తె జన్మించాలి అంటూ వీరి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక జెనీలియా కెరియర్ పరంగా తిరిగి బిజీ అవ్వాలని ప్రయత్నిస్తున్న తరుణంలో ఈమె ప్రెగ్నెంట్ కావడంతో జెనీలియా ఇండస్ట్రీకి మరికొన్ని రోజులపాటు దూరంగా ఉండబోతున్నారని స్పష్టమవుతుంది.

Related News

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Big Stories

×