BigTV English

Bayya Sunny Yadav : భయంగా ఉంది.. సన్నీ యాదవ్ తండ్రి షాకింగ్ నిజాలు

Bayya Sunny Yadav : భయంగా ఉంది.. సన్నీ యాదవ్ తండ్రి షాకింగ్ నిజాలు

Bayya Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్. బైకర్‌గా మంచి పేరుంది. అన్వేష్‌తో గొడవుంది. బెట్టింగ్ యాప్స్ కేసుుంది. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు లేటెస్ట్‌గా ఉగ్రవాది అనే ముద్ర కూడా పడింది. ఏకంగా పాకిస్తాన్‌కే దేశ సైనిక రహస్యాలు అమ్మేశాడా? అనే డౌట్ ఉంది. లేదంటే, పాకిస్తాన్‌కు నాలుగు సార్లు ఎవరైనా వెళతారా? వెళ్లినా వరుసగా రెండు నెలలు ఎవరైనా ఉంటారా? ఉన్నా, పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ బాగుందంటూ ఆ ట్రిప్ వీడియోలు ఇప్పుడు పోస్ట్ చేస్తారా? వరుసబెట్టి పాక్ వీడియోలు పెట్టడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటి? ఇలా బయ్యా సన్నీయాదవ్ చుట్టు అనేక అనుమానాలు.


సన్నీయాదవ్‌ ఎంక్వైరీ..

కట్ చేస్తే.. అతనిప్పుడు కటకటాల్లో ఉన్నాడు. NIA టీమ్ సన్నీని చెన్నై ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. పాకిస్తాన్‌కు ఎందుకెళ్లావ్? నాలుగు సార్లు వెళ్లాల్సిన పనేంటి? ఏకంగా రెండు నెలలు ఉండాల్సిన అవసరం ఏముంది? జ్యోతి మల్హోత్రాలానే దేశ రహస్యాలు అమ్మేశావా? నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది? పహల్గాం అటాక్ తర్వాత కూడా పాకిస్తాన్ వీడియోలు ఎందుకు పెట్టావ్? పాక్‌ పెద్దలతో నీకేమైనా సంబంధాలు ఉన్నాయా? అక్కడ నిన్ను ఎవరెవరు కలిశారు? నువ్వు ఎవరెవరిని కలిశావు? ఇలా అనేక రకాలుగా సన్నీయాదవ్‌ను ఎన్‌ఐఏ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.


నా కొడుకు ఉగ్రవాదా?

బయ్యా సన్నీయాదవ్ అరెస్టుపై ఆయన తండ్రి రవి యాదవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకును ఎందుకు అరెస్ట్ చేశారు? ఎవరు అరెస్ట్ చేశారో తనకు చెప్పాలంటున్నారు. తన కుమారుడు ఉగ్రవాది కాదని అంటున్నారు. సన్నీయాదవ్ టెర్రరిస్టు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

భయంగా ఉందన్న తండ్రి..

తన కుమారుడిని NIA అరెస్ట్ చేసిందా? పోలీసులు అరెస్ట్ చేశారా? అనేది తనకు ఇప్పటికీ తెలీదని చెప్పారు రవి యాదవ్. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో వారం క్రితం SB పోలీసులు తమ ఇంటికి వచ్చారని, సోదాలు చేసి వెళ్లారని అన్నారు. ఇప్పుడు మళ్లీ తన కొడుకును ఎవరో అరెస్ట్ చేయడం చూస్తుంటే భయంగా ఉందన్నారు. సన్నీయాదవ్ ఇప్పటి వరకు సుమారు 40 దేశాలు వెళ్లాడని, అక్కడి పర్యాటక ప్రాంతాలను తన వీడియోల్లో చూపించాడని అన్నారు. అలానే పాకిస్తాన్ దేశానికి కూడా వెళ్లాడని.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. గత ఫిబ్రవరిలోనే తన కుమారుడు పాక్‌కు వెళ్లాడని.. ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడి జరిగిందని.. దానికి దీనికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. సన్నీ ఉగ్రవాది అంటూ, పాక్ గూఢాచారి అంటూ రకరకాల ప్రచారం చేయడం సరి కాదని మండిపడ్డారు. సన్నీయాదవ్ అరెస్టుపై కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు తండ్రి రవి యాదవ్.

Also Read : బయ్యా సన్నీయాదవ్ అరెస్ట్ వెనుక షాకింగ్ నిజాలు..

నా కొడుకు ఫోన్ చేశాడు..

బెట్టింగ్ యాప్ కేసు సైతం అనవసరంగా పెట్టారని.. కేవలం ఒక్క వీడియోలోనే యాప్ ప్రమోట్ చేశాడంటూ నిజం ఒప్పేసుకున్నారు. తన కొడుకు కోట్లు సంపాదించాడనే ప్రచారం గురించి తనకు తెలీదన్నారు. 3 రోజుల క్రితం చివరి సారిగా తనతో మాట్లాడాడని.. ఇప్పుడు సన్నీ అరెస్ట్ అయ్యారంటూ మీడియాలో చూస్తున్నానని చెప్పారు. తన కొడుకును క్షేమంగా వదిలేయాలని కోరారు.

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×