Anil Ravipudi – Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి పెద్ద డైరెక్టర్లను నమ్మడం పూర్తిగా పక్కన పెట్టి.. టాలెంట్ ఉన్న డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే మల్లిడి విశిష్ట్ తో విశ్వంభర మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత అనిల్ రావిపూడితో మరో సినిమా చేస్తున్నాడు. విశ్వంభర మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ, వీఎఫ్ఎక్స్ పనుల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అయితే… ఇప్పుడు అనిల్ రావిపూడి మూవీ స్టార్ట్ కాబోతుంది. దీనిపై డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా సూపర్ అప్డేట్ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం…
ఏ ఏడాది సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. సీనియర్ హీరో వెంకటేష్ కి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీని ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఇది పక్కన పెడితే… చిరుతో అనిల్ మూవీ చేయాలని చాలా రోజుల నుంచి చూస్తున్నాడు. ఈ సంక్రాంతికి వస్తున్నాం మూవీ తర్వాత అనిల్ కి అది సెట్ అయింది.
చిరు పిలిచి మూవీ చేద్దాం అని చెప్పడం.. వెంటనే అనిల్ కథపై కూర్చోవడం అని చక చక జరిగిపోయాయి. తాజాగా స్క్రిప్ట్ ఫైనల్ అయిందని, చిరంజీవి కి కథ నారేషన్ అవ్వడంతో పాటు ఫైనల్ స్క్రిప్ట్ కూడా లాక్ అయింది అంటూ అనిల్ రావిపూడి తాజాగా ట్వీట్ చేశాడు. త్వరలోనే మూహుర్తం ఉండబోతుందని అని అప్డేట్ కూడా ఇచ్చాడు.
చిరు మూవీ పూజా ఎప్పుడంటే..?
త్వరలోనే మూహుర్తం అని చెప్పాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం… అనిల్ రావిపూడి – చిరంజీవి మూవీని ఈ ఉగాదికి ( మార్చి 30వ తేదీ) పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయబోతున్నారు. రెగ్యూలర్ షూటింగ్ వెంటనే స్టార్ట్ కాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి కావాల్సినన్ని డేట్స్ చిరంజీవి నుంచి అనిల్ రావిపూడి తీసుకున్నాడు. వీలైనంత స్పీడ్ గా మూవీ షూటింగ్ పార్ట్ ను అనిల్ ఎప్పటిలానే కంప్లీట్ చేయబోతున్నాడు.
సంక్రాంతికే రిలీజ్…
చిరంజివి – అనిల్ రావిపూడి కాంబోలో వచ్చే మూవీ 2026 సంక్రాంతికే ఉంటుందని ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజైన డేట్.. జనవరి 14నే చిరంజీవి – అనిల్ రావిపూడి మూవీ రిలీజ్ చేయబోతున్నారట.
Final script narration done & locked 📝☑️🔒
చిరంజీవి గారికి నా కధ లో పాత్ర
“శంకర్ వరప్రసాద్” ని పరిచయం చేశాను .. 😄
He loved & enjoyed it thoroughly ❤️🔥ఇంకెందుకు లేటు,
త్వరలో ముహూర్తంతో…
‘చిరు’ నవ్వుల పండగబొమ్మ కి శ్రీకారం 🥳#ChiruAnilMegaStar @KChiruTweets garu…
— Anil Ravipudi (@AnilRavipudi) March 26, 2025