E-Paper
Advertisement

DOP Senthil Kumar: సెంథిల్ కుమార్ ఇంట విషాదం.. అనారోగ్య సమస్యలతో భార్య కన్నుమూత..

DOP Senthil Kumar: సెంథిల్ కుమార్ ఇంట విషాదం.. అనారోగ్య సమస్యలతో భార్య కన్నుమూత..
Advertisement
DOP Senthil Kumar

DOP Senthil Kumar: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ ఇంట విషాదం నెలకొంది. అతని భార్య రూహీ ఆరోగ్య సంబంధిత సమస్యలతో గురువారం (ఫిబ్రవరి 15) కన్నుమూశారు. రూహీ గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు.

సెంథిల్ కుమార్ తన భార్యను చూసుకోవడానికి పని నుంచి విరామం తీసుకున్నాడు. కాగా ఆమె గురువారం కన్నుమూయడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు రూహీకి నివాళుల అర్పించారు.

Advertisement

Read More: సినిమా స్టార్ల క్రికెట్ టోర్నీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..?

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు రూహి అంత్యక్రియలు జరుగుతాయని నివేదికలు పేర్కొన్నాయి.

Advertisement

రూహీ యోగా శిక్షకురాలు. నటి అనుష్క శెట్టితో కలిసి పనిచేసినట్లు తెలుస్తోంది. భరత్ ఠాకూర్ యోగా క్లాసుల హైదరాబాద్ విభాగానికి కూడా ఆమె హెడ్‌గా వ్వవహించారు.

సెంథిల్ కుమార్, రూహీ జూన్ 2009లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రూహి తరచూ తన ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేసుకునేది.

కాగా సెంథిల్ కుమార్ చిత్రనిర్మాత ఎస్ఎస్ రాజమౌళితో తరచుగా కలిసి పని చేయడంతో ప్రసిద్ది చెందారు. అతను సై, చత్రపతి, యమదొంగ, అరుంధతి, మగధీర, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్, RRR వంటి ప్రముఖ చిత్రాలకు పనిచేశాడు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×