BigTV English

IND vs ENG Third Test: సర్ఫరాజ్ రనౌట్.. క్యాప్ నేలకేసి కొట్టిన రోహిత్..

IND vs ENG Third Test: సర్ఫరాజ్ రనౌట్.. క్యాప్ నేలకేసి కొట్టిన రోహిత్..
IND vs ENG Third Test Sarfaraz Khan Run Out

IND vs ENG Third Test Sarfaraz Khan Run Out: ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ క్రీజులోకి వచ్చినంత సేపు మ్యాచ్ జరిగిన తీరు ఒక ఎత్తు, తను వచ్చిన తర్వాత నడిచిన మ్యాచ్ మరో ఎత్తులా మారింది. సిక్స్ లు, ఫోర్లతో స్కోరు బోర్డుని ఉరకలెత్తించాడు. రోహిత్ శర్మ, జడేజా సెంచరీలు చేసినప్పటికి స్కోరు నత్తనడకన నడుస్తూనే ఉంది. కానీ సర్ఫరాజ్ రాకతో ఒక్కసారి మ్యాచ్ స్వరూపమే మారిపోయింది.


ఈ క్రమంలో జడేజా 99 పరుగులకు చేరుకున్నాడు. ఒక సింగిల్ తీసి సెంచరీ చేద్దామని నాన్ స్ట్రయిక్ ఎండ్ లో ఉన్న సర్ఫరాజ్ ని పిలిచాడు. తను క్రీజు దాటాడు. బంతిని ఫీల్డర్ అందుకోవడం చూసి వెనుకడుగు వేశాడు. దీంతో సర్ఫరాజ్ వెనక్కి పరుగెత్తేలోపు మార్క్ వుడ్ బంతిని డైరెక్ట్ హిట్ చేశాడు. దాంతో సర్ఫరాజ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ ఘటన చూసి రోహిత్ శర్మ తన క్యాప్ ని తీసి నేలకేసి కొట్టి, జడేజాపై తన అసహనాన్ని ప్రదర్శించాడు.

Read More: ఇంగ్లాండ్‌తో థర్డ్ టెస్ట్.. టీమిండియా రికార్డుల మోత..


తర్వాత బాల్ కి సెంచరీ చేసిన జడేజా పెద్దగా సంబరాలు చేసుకోలేదు. సర్ఫరాజ్ ని అనవసరంగా అవుట్ చేశాననే ఫీలింగ్ తో మౌనంగా ఆడుకుంటూ వెళ్లిపోయాడు. నిజానికి సర్ఫరాజ్ ఉండి ఉంటే, మ్యాచ్ మరో రేంజ్ లో ఉండేదని క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

జడేజా తన సెంచరీ కోసమని అంత జాగ్రత్తగా ఆడాడు. మరో ఎండ్ లో అద్భుతంగా ఆడుతున్న సర్ఫరాజ్ కోసం, కొంచెం నిదానంగా ఆడాల్సిందని అంటున్నారు. తను కొద్దిగా అప్రమత్తంగా ఆడి ఉంటే, పనిలో పని సర్ఫరాజ్ కూడా శతకం సాధించేవాడని అంటున్నారు. పాపం సర్ఫరాజ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఆరంగ్రేటం మ్యాచ్ అనే దాని అర్థాన్నే సర్ఫరాజ్ మార్చేశాడని అంటున్నారు. కాన్ఫిడెన్స్ అంటే అలా ఉండాలని, ఏ మాత్రం జంకు, బొంకు లేకుండా ఇంగ్లాండ్ బౌలర్లని ఒక ఆట ఆడుకున్నాడు. నిజానికి సర్ఫరాజ్ ఆఫ్ సెంచరీ చేసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ నుంచి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ దగ్గర నుంచి అందరూ నిలుచుని స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.

ఒక రిథమ్ తో ఆడుతున్న సర్ఫరాజ్ అలా అవుట్ కావడం టీమ్ ఇండియా భారీ స్కోరుకి బ్రేక్ పడినట్టేనని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే రోహిత్ శర్మకు అంత ఆవేశం వచ్చిందని అంటున్నారు. అయితే మరో ఎండ్ లో జడేజా కూడా ఈ ఘటనతో చాలా బాధపడ్డాడు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×