BigTV English
Advertisement

RaviTeja 75 Movie Title : మాస్ ‘జాతర’ కు ఇక పూనకాలే… టైటిల్, రిలీజ్ డేట్ డీటైల్స్ ఇవే..!

RaviTeja 75 Movie Title : మాస్ ‘జాతర’ కు ఇక పూనకాలే… టైటిల్, రిలీజ్ డేట్ డీటైల్స్ ఇవే..!

RT75 Movie Title.. రవితేజ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ప్రముఖ డైరెక్టర్ కృష్ణ వంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరియర్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘సింధూరం’ మూవీతో సెకండ్ హీరోగా పరిచయమై, ‘నీ కోసం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న రవితేజ అనతి కాలంలోనే మాస్ మహారాజా గా పేరు దక్కించుకున్నారు. ఇప్పటికే 74 చిత్రాలు పూర్తి చేసిన ఈయన ప్రస్తుతం 75వ చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, రిలీజ్ డేట్ కూడా మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు.


RT 75 మూవీ విశేషాలు..

చివరిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేసిన రవితేజ, ఇప్పుడు RT 75 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా ప్రారంభించారు. జూన్ 11వ తేదీన రవితేజ 75వ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాదులో ఘనంగా జరిగాయి. ఈ చిత్రానికి సామజవరగమన సినిమాకి రచయితగా పనిచేసిన భాను భోగవరపు.. దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రవితేజకు జోడీగా శ్రీ లీల మరోసారి జతకట్టనుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో 2022లో వచ్చిన ధమాకా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే మ్యాజిక్ మళ్ళీ రిపీట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.


రవితేజ టైటిల్, రిలీజ్ డేట్ లాక్..

మాస్ మహారాజా రవితేజ ఇందులో లక్ష్మణ్ భేరీ అనే పాత్రలో.. పక్కా తెలంగాణ స్లాగ్ తో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పుడు ఆ మూవీకి ‘జాతర’ అనే టైటిల్ పిక్స్ చేసినట్లు సమాచారం. ‘అంతా మనదే’ అనేది ఆ మూవీ ట్యాగ్ లైన్ అని తెలిసింది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మే 9న ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.త్వరలో దీనిపై అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు మేకర్స్.

రవితేజ కెరియర్..

రవితేజ కెరియర్ విషయానికి వస్తే.. రవితేజ కెరియర్ విషయానికి వస్తే.. ఒకవైపు హీరోగా కొనసాగుతూనే మరొకవైపు నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టారు. 2022లో తమిళ సినిమా మట్టి కుస్తీ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన రవితేజ, ఆ తర్వాత 2023లో రావణాసురుడు, ఛాంగురే బంగారు రాజా, సుందరం మాస్టర్ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

తమ్ముడు కూడా నటుడే..

రవితేజ మాత్రమే కాదు రవితేజ తమ్ముడు భరత్ కూడా పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఒక్కడే, అతడే ఒక సైన్యం, జంపు జిలాని, పెదబాబు , దోచేయ్ వంటి చిత్రాలలో నటించిన భరత్ 2017 జూలై 24న అర్ధరాత్రి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీద శంషాబాద్ మండలం, కొత్వాల్ గూడా దగ్గర కార్లో అతివేగంగా ప్రయాణిస్తూ.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందారు.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×