BigTV English

Ruhani Sharma: ఆ ఓటీటీలోకి టాలీవుడ్ బ్యూటీ రుహానీ బోల్డ్ మూవీ ‘ఆగ్రా’.. పెద్దలకు మాత్రమే!

Ruhani Sharma: ఆ ఓటీటీలోకి టాలీవుడ్ బ్యూటీ రుహానీ బోల్డ్ మూవీ ‘ఆగ్రా’.. పెద్దలకు మాత్రమే!

Ruhani Sharma Bold Movie: గత కొన్నేళ్లుగా ఇండియన్ సినిమాల్లో కూడా బోల్డ్ కంటెంట్ పెరిగిపోయింది. ఇప్పుడు కొన్ని చిత్రాల్లో వస్తున్న బోల్డ్ సీన్స్ చూస్తుంటే హాలీవుడ్ గుర్తొస్తుందని ప్రేక్షకులు విమర్శిస్తున్నారు కూడా. కానీ అనవసరంగా బోల్డ్ సీన్స్ యాడ్ చేయమని, కథకు అవసరం అనిపిస్తేనే చేస్తామని మేకర్స్ వాదిస్తున్నారు. తాజాగా రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించిన ఒక మూవీలో కూడా అలాంటి సీన్స్ చూసి కొందరు ప్రేక్షకులు షాకవుతున్నారు. మూవీ మొత్తం అలాంటి సీన్సే అని కామెంట్లు పెడుతున్నారు. ఆ మూవీ గురించి కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవ్వగా ఫైనల్‌గా అది ఓటీటీలోకి కూడా వచ్చేసింది.


అవకాశాలు రాలేదు

‘చిలసౌ’ అనే మూవీతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయమయ్యింది రుహానీ శర్మ. అందులో తను చేసిన అంజలి పాత్ర చాలామందికి ఫేవరెట్. ఇదొక పక్కింటమ్మాయి టైప్ క్యారెక్టర్ కావడంతో ఆఫ్ స్క్రీన్ కూడా రుహానీ అలాగే ఉంటుందని చాలామంది ప్రేక్షకులు ఊహించారు. కానీ తను ఆఫ్ స్క్రీన్ చాలా బోల్డ్‌గా, మోడర్న్‌గా ఉండేది. అయినా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. మొదటి సినిమాలోనే తన నటన చూసి స్టార్ హీరోయిన్ అయిపోతుంది అనుకున్నారంతా. కానీ మెల్లగా తనకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అదే సమయంలో తను ‘ఆగ్రా’ అనే ఒక హిందీ మూవీలో నటించింది.


Also Read: బిగ్ టీవీలో ‘కిర్రాక్ కపుల్స్’ షో.. యాంకర్స్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

స్పందించిన రుహానీ

‘ఆగ్రా’.. పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్ జరుపుకుంది. అదే సమయంలో మూవీలో పలు బోల్డ్ సీన్స్ ఉన్నాయని, అందులో రుహానీ శర్మ రెచ్చిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అంతే కాకుండా ఈ బోల్డ్ సీన్స్ లీక్ అయ్యి.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దీంతో తన ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. రుహానీ ఏంటి ఇలా చేసింది అంటూ కొన్నాళ్ల పాటు ఇదే హాట్ టాపిక్ నడిచింది. ప్రేక్షకుల కామెంట్స్‌పై ఫైనల్‌గా రుహానీ శర్మ స్పందించక తప్పలేదు. ఇది ఒక ఆర్ట్ అని, ఆర్ట్‌ను, ఆర్టిస్ట్‌ను గౌరవించండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది.

అందులో స్ట్రీమింగ్

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్ అయినా కూడా ఇండియాలో మాత్రం ‘ఆగ్రా’ మూవీ విడుదలకు అనుమతి లభించలేదు. అందుకే అమెజాన్ ప్రైమ్ వీడియో మాత్రం ఈ సినిమాను ఫ్రెంచ్ భాషలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. ఈ మూవీని తెలుగులో చూడాలనుకునేవారికి మాత్రం ఇది ఏ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో స్ట్రీమ్ అవ్వడం లేదనే వార్తే వినిపిస్తోంది. కానీ పలు పైరసీ సైట్లు మాత్రం ‘ఆగ్రా’ను తెలుగులో కూడా స్ట్రీమ్ చేస్తున్నాయి. ఈ మూవీని తిత్లి కనుబెల్ డైరెక్ట్ చేశారు. మోహిత్ అగర్వాల్, రుహానీ శర్మ హీరోహీరోయిన్లుగా నటించారు. వీరితో పాటు అంచల్ గోస్వామి, ప్రియాంక బోస్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×