BigTV English
Advertisement

Rs.20 Police Bribery : కేవలం రూ.20 లంచం తీసుకున్న పోలీస్.. 34 ఏళ్ల తరువాత మండిపడిన కోర్టు!

Rs.20 Police Bribery : కేవలం రూ.20 లంచం తీసుకున్న పోలీస్.. 34 ఏళ్ల తరువాత మండిపడిన కోర్టు!

Rs.20 Police Bribery | సమాజంలో చెడు నిర్మూలించేందుకు నిత్యం పనిచేసే పోలీసు వ్యవస్థలో కొంతమంది అవినీతి పరులను కూడా చూస్తూ ఉంటాం. అయితే అలాంటివారు పట్టుబడిన తరువాత వారికి శిక్షలు పడడం అరుదు. ఇలాంటిదే ఒక కేసులో ఒక అవినీతి పరుడైన ఒక పోలీస్ కానిస్టేబుల్ కు 34 ఏళ్ల తరువాత అవినీతి శాఖ అధికారులు అరెస్టు చేశారు. అయితే ఆ పోలీస్ కేవలం రూ.20 మాత్రమే లంచం తీసుకోవడం గమనార్హం. కానీ ఆ రూ.20 లు ఎవరి వద్ద నుంచి తీసుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో తీసుకున్నాడో తెలిస్తే.. ఆశ్చర్యం వేస్తుంది.


వివరాల్లోకి వెళితే.. బిహార్ రాష్ట్రంలోని లఖిసరాయ్ జిల్లా బడహియా పట్టణంలో పోలీస్ కానిస్టేబుల్ గా 1990లో సురేష్ ప్రసాద్ డ్యూటీ చేస్తున్నాడు. అయితే ఒకరోజు ఆయనకు రైల్వే స్టేషన్ వద్ద భద్రత కోసం డ్యూటీ వేశారు. అయితే రైల్వే స్టేషన్ బయట కూరగాయలు విక్రయించుకునే సీతాదేవి అనే మహిళ తో కానిస్టేబుల్ సురేష్ ప్రసాద్ గొడవపడ్డాడు.

ఆమె అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. అయితే సమీపంలోని మహేష్ ఖూట్ అనే గ్రామానికి చెందిన సీతాదేవి ప్రతి రోజు అక్కడే కూర్చొని కూరగాయలు విక్రయించుకొని జీవనం సాగించేది. సీతాదేవి ఎంత వేడుకున్నా కానిస్టేబుల్ సురేష్ ప్రసాద్ వినలేదు. ఆమె కూరగాయల గంపలను తన్ని అక్కడి నుంచి బలపూర్వకంగా ఆమెను తొలగించాడు. అంతటితో ఆగక ఆమెను అరెస్టు చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన సీతాదేవి తనను క్షమించి వదిలయేమని ప్రాధేయపడింది.


Also Read: సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?

సీతాదేవి పరిస్థితి చూసి ఏమైనా డబ్బులుంటే ఇచ్చి వెళ్లిపోవాలని కానిస్టేబుల్ సురేష్ ప్రసాద్ చెప్పాడు. కానీ సీతాదేవి తన వద్ద ఏమీ లేవని చెప్పగా.. కానిస్టేబుల్ సురేష్ ప్రసాద్ కనికరం లేకుండా సీతాదేవి చీరకొంగు ముడిలో డబ్బులున్నట్లు పసిగట్టాడు. వెంటనే ఆమె కొంగుని బలవంతంగా లాగి అందులోనుంచి రూ.20 తీసుకున్నాడు. సీతాదేవి తన వద్ద ఆ డబ్బులు మాత్రమే ఉన్నాయని వాటిని తిరిగి ఇచ్చేయమని ఏడుస్తుండగా.. అప్పుడే అక్కడికి రైల్వే స్టేషన్ ఇంచార్జ్ వచ్చి విషయం తెలుసుకున్నాడు.

కానిస్టేబుల్ సురేష్ ప్రసాద్ ఆకృత్యాలను చూసి ఆ రైల్వే స్టేషన్ ఇంచార్జ్ కోపంతో అతనిపై అవినీతి ఫిర్యాదు నమోదు చేయించాడు. అయినా ఈ కేసు విచారణ త్వరగా ప్రారంభం కాలేదు. ఆ కేసుని 1998లో విచారణ మొదలుపెట్టిన కోర్టు 1999 సంవత్సరంలో నిందితుడు కానిస్టేబుల్ సురేష్ ప్రసాద్‌ని అరెస్టు చేయాలని ఆదేశించింది. అంతవరకు కూడా నిందితుడు సురేష్ ప్రసాద్‌ ఒక్కసారి కూడా కోర్టులో విచారణ కోసం హాజరు కాలేదు.

అయితే అరెస్ట్ వారెంట్ గురించి తెలుసుకున్న సురేష్ ప్రసాద్‌ పరారయ్యాడు. గత 25 ఏళ్లుగా అవినీతి కేసులో సస్పెండ్ అయిన కానిస్టేబుల్ సురేష్ ప్రసాద్‌ అరెస్ట్ ని తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. ఈ కేసులో తాజాగా 2024 ఆగస్టు నెలలో కోర్టు మరోసారి విచారణ చేపట్టింది. 25 ఏళ్లుగా పరారీలో నిందితుడు ఉంటే పోలీస్ శాఖ ఏం చేస్తోందని న్యాయమూర్తి మండిపడ్డారు. వెంటనే రాష్ట్ర డిజిపీని ఈ కేసులో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సస్పెండెడ్ కానిస్టేబుల్ సురేష్ ప్రసాద్‌ కోసం పోలీసులు మరోసారి గాలింపు మొదలుపెట్టారు.

Also Read: మిస్ కాల్ తో మొదలైన ప్రేమ.. ప్రియుడిని వివాహం చేసుకోవడానికి హంతకురాలిగా మారిన లేడి!

Related News

Road Accident: పెళ్లి కారు టైరు పేలి‌.. ముగ్గురు స్పాట్‌డెడ్‌

Road Accident: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. మంటల్లో తగలబడి.. 8 మంది స్పాట్!

Patancheru Tollgate: ఘోర రోడ్డు ప్రమాదం.. పటాన్‌చెరులో ట్యాంకర్‌ బోల్తా..

Hyderabad News: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే..?

TMC MP Kalyan Banerjee: సైబర్ వలకు చిక్కిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ₹55 లక్షల స్వాహా!

Tamil Nadu: చిన్నారి ప్రాణం తీసిన తల్లి.. మరో మహిళతో అఫైర్‌!

Nellore Accident: నెల్లూరులో స్కార్పియో యాక్సిడెంట్.. నలుగురు టీచర్లు స్పాట్!

Rajendranagar Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం వాహనం..

Big Stories

×