E-Paper
Advertisement

Russians shot the first film in space : అంతరిక్షంలో సినిమా షూటింగ్.. దుమ్మురేపుతున్న ఆ ట్రైలర్

Russians shot the first film in space : అంతరిక్షంలో సినిమా షూటింగ్.. దుమ్మురేపుతున్న ఆ ట్రైలర్

Russians shot the first film in space : ఫారిన్ లొకేషన్లలో సినిమా షూటింగ్ చేస్తేనే మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. అలాంటిది అంతరిక్షంలో సినిమా షూటింగ్ చేస్తే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే అదో అద్భుతమైన అనుభూతి కలుగుతుంది కదా. హాలీవుడ్ స్టార్ టామ్ క్రూయిజ్ ఒక సినిమా సీక్వెల్ ను అంతరిక్ష కేంద్రంలో షూటింగ్ జరపాలని నిర్ణయించారు. దీనికి నాసా సహకారం కోరారు. ఇది హాలీవుడ్ లో సెన్సేషనల్ న్యూస్ అయింది. అయితే ఈలోపే రష్యాకు చెందిన డైరెక్టర్ క్లిమ్ షిపెంకో విడుదల చేసిన ఒక ట్రైలర్ చూసి నోరెళ్లబెట్టడం హాలీవుడ్ తోపాటు సినీ అభిమానుల వంతయింది. అంతరిక్షంలో సినిమా షూటింగ్ కు హాలీవుడ్ ప్లాన్ చేస్తున్న టైంలోనే రష్యన్ దర్శకుడు క్లిమ్ షిపెంకో తను రూపొందిస్తున్న “ద చాలెంజ్” సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ సినిమాని 2021 అక్టోబర్ లోనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం-ఐఎస్ఎస్ లో రూపొందించారు. అందులోని ఒక సీన్ కోసం 12 రోజులపాటు ఆ అంతరిక్ష కేంద్రంలోనే గడిపారు. ఈ నటుల్లో యూలియా పెరెస్లిడ్ కూడా ఉన్నారు. ఈ వివరాలు వెల్లడించగానే ద చాలెంజ్ సినిమాకు భారీ హైప్ క్రియేట్ అయింది. ఇప్పుడీ ట్రైలర్ దుమ్మురేపుతోంది.

ఇప్పుడు సినిమా రిలీజ్ కంటే ముందే మేకింగ్ విజువల్స్ రిలీజ్ చేయడం ట్రెండ్ గా మారింది. ద చాలెంజ్ సినీ యూనిట్ కూడా ఇదే పని చేయబోతోంది. షూటింగ్ కోసం సినిమా టీం ఐఎస్ఎస్ లో ఎలా ల్యాండైంది? ఎలా షూటింగ్ కంప్లీట్ చేసిందనే విజువల్స్ ని ముందుగా విడుదల చేయకుండా సినిమాలోనే చూపించబోతోంది. అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఓ కాస్మానాట్ ప్రాణాలు కాపాడేందుకు ఐఎస్ఎస్ కు వెళ్లిన డాక్టర్ గా యూలియా ఇందులో నటించింది. ఇక అంతరిక్షంలో షూటింగ్ జరుపుకున్న తొలి సినిమాగా ద చాలెంజ్ రికార్డులకు ఎక్కింది. నిజానికి హాలీవుడ్ సొంతం చేసుకోవాలనుకున్న ఈ ఘనతను రష్యా దక్కించుకుంది. మరోవైపు చంద్రమండలంపై నివాసం ఏర్పర్చే దిశగా నాసా ప్రయోగాలు సాగుతున్నాయి. ఒకవేళ ఇవి ఫలిస్తే… చంద్రుడితోపాటు అంగాకర గ్రహంపైనా షూటింగ్ చేస్తామని రష్యన్ దర్శకుడు క్లిమ్ షిపెంకో చెబుతున్నారు. ఇంతకీ ద చాలెంజ్ సినిమా షూటింగ్ అంతరిక్షంలో ఎలా జరిపారనేది సినీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×