Karthika Deepam 2 serial today Episode: రెస్టారెంట్‌లో ఐస్‌క్రీం తింటూ క్లోజ్‌గా ఉండటం దశరథ, సుమిత్ర చూస్తారు. దగ్గరకు వెళ్లి గొడవ పడతారు. జ్యోత్స్న ఇలా అవ్వడానికి కారణం నువ్వే అంటూ సుమిత్ర కోపంగా దశరథను తిడుతుంది. ఎందుకు అంటూ దశరథ ప్రశ్నిస్తే.. దాన్ని ఆఫీసు వెళ్లమని ప్రోత్సహించింది నువ్వే కదా అంటుంది. అప్పుడే శౌర్య రావడంతో అందరూ కామ్‌గా అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతారు.
ఇంటికి వెళ్లాక సుమిత్ర కోపంగా మాలినికి కాల్ చేస్తుంది. జ్యోత్స్న వెనకు సూరజ్ పడకుండా చూసుకోమని చెప్తుంది. పీఏ అంటే ఆఫీసులో పని చేసే వరకు కానీ బయటకు తీసుకెళ్లి ఐస్‌క్రీమ్స్ తినిపించడం.. బుగ్గలు గిల్లడం లాంటివి చేయడానికి కాదని అధికార దర్పం చూపించి ఆడపిల్లలను లోంగదీసుకోవడం సంస్కారం కాదని వార్నింగ్ ఇస్తుంది. ఆడవాళ్ల జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నాడా..? నీ కొడుకుని అదుపులో పెట్టుకో.. నీకు చేతకాకపోతే నాకు అప్పగించు అదుపులో పెడతాను లేదంటే వెంటనే నీ కొడుకుకి పెళ్లి చేసేయ్.. నీ కొడుకో తిరుగుబోతు వాడికి జన్మలో పెళ్లి అవ్వదని తెలిసి నా కూతురు వెంట పడుతున్నాడా..? అంటూ కోపంగా తిట్టి కాల్ కట్ చేస్తుంది. జ్యోత్స్న బాధగా లోపలికి వెళ్లిపోతుంది. దీప వచ్చి మీరేం చూశారో నాకు తెలియదు కానీ జ్యోత్స్న తప్పు చేయదని అంటుంది.
మరోవైపు మాలిని ఇంట్లో సూరజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సూరజ్ వస్తాడు. మాలిని వెటకారంగా జ్యోత్స్నతో బలాదూర్‌గా తిరగడం అయిపోయిందా..? నాకు చెప్తే నేనే ఐస్‌క్రీమ్ ఆర్డర్ పెట్టేదాన్ని కదా..? ఇద్దరు కలిసి ఇంట్లోనే ఐస్‌క్రీమ్ తినేవాళ్లు అంటూ మాట్లాడుతుంది. సూరజ్ షాకింగ్‌గా చూస్తుంటాడు. మాలిని ఫోన్ చేసిన విషయం ఇద్దరిని కలిపి తిట్టిన విషయం మొత్తం చెప్తుంది మాలిని. మాలిని మాటలు విని దక్షణమూర్తి ఆనందతో ఉప్పొంగిపోతాడు. పోనీలే ఇవాళ సుమిత్రకు మనకు ఫోన్ చేయాలనిపించింది. రేపు ఇంటికి రావాలనిపిస్తుంది అంటూ చెప్పగానే.. సుమిత్ర ఇంటికి రావాలని నాకు ఉంది మామయ్యగారు.. కానీ ఇలా కాదు అంటుంది మాలిని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది. దక్షిణమూర్తి నవ్వుతూ సూరజ్ దగ్గరకు వెళ్లి మీరిద్దరూ కలిసి ఐస్‌క్రీమ్ తిన్నారా..? పోనీలే ఎవరేమనుకున్నాన మీరు రేపు మరో చోట తినండి అంటూ సూరజ్‌కు చెప్తాడు.
రూంలో అలిగి ఉన్న జ్యోత్స్న దగ్గరకు కాఫీ తీసుకుని వెళ్తుంది సుమిత్ర. జ్యోత్స్న తనకు కాఫీ వద్దని కొడతారు మీరే పెడతారు అంటూ మాట్లాడితే మరి ఎవరిస్తే తాగుతావు కాఫీ అంటూ సుమిత్ర వెటకారంగా మాట్లాడితే.. జ్యోత్స్న కోపంగా మమ్మీ అంటూ అరుస్తుంది. అందుకు సుమిత్ర కూల్‌గా మాకు కూడా ఇలాగే బాధగా ఉంటుంది జ్యోత్స్న. అందుకే నువ్వు అక్కడ ఉద్యోగం మానేయ్ నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాం అని చెప్తుంది. అందుకు జ్యోత్స్న తాను ఇప్పుడే పెళ్లి చేసుకోనని చెప్తుంది. ఎందుకు చేసుకోవు ఆ సూరజ్‌ను చేసుకుంటావా ఏంటి అంటూ పారు అడుగుతూ వస్తుంది. జ్యోత్స్న కోపంగా పారును తిట్టి నా జీవితంలో ఇన్ని మలుపులు జరుగుతాయని మనం అనుకున్నామా..? సూరజ్‌తో పెళ్లి సెట్ అవుతుందని.. పెళ్లి పీటల మీద ఆగిపోతుందని అనుకున్నామా..? అలాగే మనం కోల్పోయినవన్నీ తిరిగి రావాలి. డబ్బు, ఆస్థి, ఆఫీసులు, ఇండ్లు, గౌరవం అన్ని తిరిగి వచ్చాకే తాను పెళ్లి చేసుకుంటానని చెప్తుంది జ్యోత్స్న. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.