BigTV English

Saiyami Kher: 19 ఏళ్లకే తెలుగు డైరెక్టర్ కమిట్మెంట్ అడిగాడు… ఇన్నాళ్లకు కాస్టింగ్ కౌచ్ నోరు విప్పిన నటి..

Saiyami Kher: 19 ఏళ్లకే తెలుగు డైరెక్టర్ కమిట్మెంట్ అడిగాడు… ఇన్నాళ్లకు కాస్టింగ్ కౌచ్ నోరు విప్పిన నటి..

Saiyami Kher: ఇటీవల కాలంలో ప్రతి ఇండస్ట్రీలోనూ క్యాస్టింగ్ కౌచ్ పై వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా అడిగినప్పుడు బెడ్ ఎక్కాల్సిందే అని చాలామంది అమ్మాయిలు ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది ఇలాంటి బాధలను భరించమంటూ పలు ఇంటర్వ్యూలలో బయటపెడుతున్నారు. ఒకవైపు ఇలాంటి వాటిపై కమిటీలు ఏర్పాటు చేసి ఇండస్ట్రీలో ఇలాంటీవీ రిపీట్ అవ్వకుండా చూసే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మరో బాలీవుడ్ నటి సయామీ ఖేర్ కాస్టింగ్ కౌచ్ అనుభవాలను బయటపెట్టారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.


సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సెగ.. 

చిత్ర పరిశ్రమలో గత కొన్ని నెలలుగా క్యాస్టింగ్‌ కౌచ్‌ పై ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సర్వ సాధారణమని, సినిమా ఆఫర్స్ కోసం కమిట్‌మెంట్స్ అడుగుతారనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. ఇప్పటికే అనేకమంది హీరోయిన్లు ఇండస్ట్రీలో తమకు ఎదురైనా అనుభవాలను ఇంటర్వ్యూల ద్వారా బయటపెట్టారు. ఇండస్ట్రీలో సినిమాల్లో రాణించాలని ఎంతో ఆశగా వస్తే ఇలాంటివి ఎదురవడం వల్ల బాధేస్తుందని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సయామీ ఖేర్ కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది.


19 ఏళ్లలోనే క్యాస్టింగ్ కౌచ్.. 

సమీయా ఖేర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవించిన గుర్తుచేసుకుంది. “నాకు వచ్చిన అన్ని ఆఫర్ల విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని అని భావిస్తాను.. నేను 19 వయసులో ఉన్నప్పుడే నాకు సినిమా అవకాశాలు వచ్చేవి. ఆ టైంలో తెలుగులో అవకాశాలు కూడా క్యూ కట్టాయి. అయితే నాకు ఫోన్ చేసి రమ్మని పిలిచారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు కావాలి అంటే మీరు కొన్ని విషయాలు కాంప్రమైజ్ అవ్వాల్సిందే అంటూ నాకు చెప్పింది. ఈ కాంప్రమైజ్ ఏంటి అనేది నాకు అర్థం కాలేదు.

Also Read : తస్సాదియ్యా.. పైసా వసూల్ అంటున్న బాలయ్య..

ఆ తర్వాత ఇది విని నేను షాక్ అయ్యాను. మేడం మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని నేను అప్పుడు ఆమెతో వాదించాను. కానీ అవి మాత్రం ఏమీ మాట్లాడకుండా మేడం మీరు ఇలాంటివి అర్థం చేసుకోవాలి అని గట్టిగా అరిచింది. నేను ఈ మార్గంలో వెళ్లాల్సిన వ్యక్తిని అని మీరు భావిస్తున్నందుకు నాకు బాధగా ఉంది. నా జీవితంలో నేను ఎప్పుడూ దాటని కొన్ని పరిమితులు ఉన్నాయి. అలానే నడుస్తాను అని ఆమెతో అన్నాను. అలా నేను అప్పుడే ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని సయామీ కేర్ అన్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వడంతో దీని పై సోషల్ మీడియాలో చర్చనీయంశంగా మారింది. ప్రస్తుతం అన్నీ ఇండస్ట్రీలలో ఇలాంటివి కామన్ అయ్యాయి. ఇలాంటి వాటిని పూర్తిగా నిర్మూలన జరిగితేనే ఆడవాళ్లకు మంచి రోజులు వస్తాయని డిమాండ్ లు పెరుగుతాయని, వాళ్ళలోని టాలెంట్ బయట పడుతుందని ఆమె అంటున్నారు. చూడాలి ఇప్పటికైన ఇలాంటి తగ్గుతాయేమో..

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×