OTT Movie : గ్రిప్పింగ్ నరేషన్ ఉండాలే కానీ సీరియల్ కిల్లర్ సినిమాలను మించిన ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉండవేమో అన్పిస్తుంది. అలాంటి ఓ అదిరిపోయే స్టోరీ గురించే ఈ రోజు మనం చెప్పుకోబోయేది. ఈ సినిమాలో సైకో అమ్మాయిలనే టార్గెట్ చేసి, ఆపై అఘాయిత్యం చేసి, అత్యంత కిరాతకంగా చంపుతుంటాడు. పోలీస్ అయిన హీరోకి చివరి వరకూ చుక్కలు చూపిస్తాడు. మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
డిసిపి రాఘవన్ డిసిప్లిన్డ్, స్ట్రిక్ట్ పోలీసు ఆఫీసర్. చెన్నైలో డిప్యూటీ కమిషనర్ గా పని చేస్తాడు. పర్సనల్ లైఫ్ లో జరిగిన ఓ సంఘటన కారణంగా లోలోపలే బాధ పడుతూ ఉంటాడు. ఆయన భార్య గాయత్రిని కోల్పోయిన గాయం అతన్ని ఇంకా వెంటాడుతుంది. ఈ క్రమంలోనే రాఘవన్ ఒక హత్య కేసు విచారణలో బిజీగా ఉండగా, అతని స్నేహితుడి కూతురు రానీ (ధన్య) మిస్ అవుతుంది. ఆమెను ఒక సీరియల్ కిల్లర్ కిడ్నాప్ చేసి, కిరాతకంగా చంపేస్తాడు. ఈ కేసును రాఘవన్ పర్సనల్ గా తీసుకుంటాడు. ఆ కిల్లర్‌ను పట్టుకుంటానని శపథం చేస్తాడు.
విచారణ రాఘవన్‌ను చెన్నై నుండి న్యూయార్క్‌కు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఈ హత్యలు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నాయని తెలుస్తుంది. అక్కడ రాఘవన్ అరుణా అనే అమ్మాయిని కలుస్తాడు. ఆమె రాఘవన్‌కు కేసులో సహాయం చేస్తుంది. ఈ కేసును లోతుగా ఇన్వెస్టిగేట్ చేయగా, ఇద్దరు సీరియల్ కిల్లర్‌లు అముదన్, ఇళమారన్ ఈ హత్యల వెనుక ఉన్నారని తెలుస్తుంది. వీరిద్దరూ సైకోపాత్‌లు… యువతులను టార్గెట్ చేసి, వేధించి మరీ చంపేస్తారు. అయితే డీసీపీ తమ వెంట పడుతున్నాడని తెలుసుకుని అరుణాను కిడ్నాప్ చేసి, దమ్ముంటే తమను పట్టుకోమని హీరోకి ఛాలెంజ్ విసురుతారు. క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది. ఇంతకీ హీరో ఫస్ట్ వైఫ్ ఎలా చనిపోయింది ? ఆ సైకో కిల్లర్లు ఎందుకు అమ్మాయిల్నే చంపుతున్నారు? చివరికి అరుణా వాళ్ళ నుంచి ఎలా బయట పడింది? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.
తెలుగులోనూ అందుబాటులో…
‘వేట్టైయాడు విలైయాడు’ (Vettaiyaadu Vilaiyaadu) మూవీ తమిళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కమల్ హాసన్, జ్యోతిక, కమలినీ ముఖర్జీ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం సీరియల్ కిల్లర్ థీమ్‌తో ఉత్కంఠభరితమైన కథాంశంతో నడుస్తుంది. 2006లో విడుదలైన ఈ మూవీ తెలుగులోనూ అందుబాటులో ఉంది. కాగా ఈ మూవీని యూట్యూబ్ (Youtube) లో ఫ్రీగానే చూడవచ్చు.
Read Also : కన్న కొడుకునే చంపి తినాలనుకునే తండ్రి… ఆ తల్లి చేసే పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మావా