OTT Movie : ఒక్కసారి చూడడం మొదలు పెడితే చివరి వరకూ ఎంగేజింగ్ గా ఉండే, సైకో కిల్లర్ సినిమాలంటే పడి చచ్చే మూవీ లవర్స్ సంఖ్య భారీగానే ఉంది. ఇలాంటి సినిమాలంటే ఇష్టపడే వారు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఇది. పైగా ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్. చివరి వరకు సస్పెన్స్ తో టెన్షన్ పెట్టిస్తుంది ఈ మూవీ. మరి ఈ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో ఉందో చూద్దాం పదండి.
స్టోరీలోకి వెళితే
అంజలి విక్రమాదిత్యన్ ట్యాలెంటెడ్ సీబీఐ ఆఫీసర్. ఆమె ఒక క్రూరమైన సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి నడుం బిగిస్తుంది. ఈ కిల్లర్ అమ్మాయిలను కిరాతకంగా హత్యలు చేస్తూ ఉంటాడు. ఎంత ప్రయత్నించినా అతనెవరో పోలీసులు కూడా కనిపెట్టలేకపోతారు. అంజలి ఈ కేసును విచారిస్తూ ఉండగా, ఆమె వ్యక్తిగత జీవితం కూడా దీనితో ముడిపడుతుంది. ఆమె సోదరుడు అర్జున్ ఒక డాక్టర్. అతను కృతితో ప్రేమలో ఉంటాడు.
సినిమా మొదటి భాగంలోనే అంజలి ఒక సీరియల్ కిల్లర్‌ను అరెస్టు చేసినట్లు చూపిస్తారు. కానీ కొత్త హత్యలు జరగడంతో ఆమె పట్టుకున్న వ్యక్తి నిజమైన కిల్లర్ కాదని తెలుస్తుంది. నిజమైన కిల్లర్ రుద్ర ఒక మేధావి. పైగా అతను అంజలికి పర్సనల్ లైఫ్ లో చాలా క్లోజ్. రుద్ర ఈ హత్యలను చాలా తెలివిగా ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలోనే అంజలి కూతురు వాడి బారిన పడుతుంది. ఈ ప్రమాదం నుంచి కూతురిని కాపాడుకోవడానికి హీరోయిన్ ఏం చేసింది? అసలు ఆ కిల్లర్ ఆమెకు ఏమవుతాడు? చివరికి ఆ సైకోని హీరోయిన్ ఎలా పట్టుకుంది? అనేది మిగతా స్టోరీ.
మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ సినిమా పేరు ‘ఇమైక్కా నోడిగల్’ (Imaikkaa Nodigal). ఇదొక తమిళ సైకో-థ్రిల్లర్ సినిమా. ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, అథర్వా, అనురాగ్ కశ్యప్, రాశీ ఖన్నా, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ నటించారు. ఈ సినిమా సీరియల్ కిల్లర్ థీమ్‌తో ఉత్కంఠభరిత కథాంశం, పవర్ ఫుల్ యాక్టింగ్, ఊహించని ట్విస్ట్‌లతో వర్త్ వాచింగ్ మూవీ అన్పిస్తుంది. 2018లో విడుదలైన ఈ మూవీ కమర్షియల్ గా కూడా హిట్ అయ్యింది. ఇక ఈ మూవీ ప్రస్తుతం 3 ఓటీటీలలో అందుబాటులో ఉంది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ (Airtel Xstream ), ప్రైమ్ వీడియో (Amazon Prime video) వంటి ఓటీటీలతో పాటు యూట్యూబ్ (Youtube ) లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : కన్న కొడుకునే చంపి తినాలనుకునే తండ్రి… ఆ తల్లి చేసే పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మావా