E-Paper
Advertisement

Sai Dharam Tej: కొండా సురేఖకు మెగా మేనల్లుడు విజ్ఞప్తి.. వారిని బలిచేయకండి అంటూ..

Sai Dharam Tej: కొండా సురేఖకు మెగా మేనల్లుడు విజ్ఞప్తి.. వారిని బలిచేయకండి అంటూ..
Advertisement

Sai Dharam Tej: మంత్రి కొండా సురేఖ.. అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన ఆరోపణలు ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేశాయి. సమంత, నాగ చైతన్య, అక్కినేని నాగార్జున పేర్లను ఉపయోగించి.. కొండా సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఇక టాలీవుడ్ లో ఒకరికి అన్యాయం జరిగితే.. ఇండస్ట్రీ మొత్తం కలిసిపోతుంది అన్న విషయం అందరికి తెల్సిందే. ఇప్పుడు మరోసారి అది రుజువైంది.

అక్కినేని కుటుంబానికి టాలీవుడ్ మొత్తం అండగా నిలబడింది. ఒకరి తరువాత ఒకరు సమంతకు, అక్కినేని కుటుంబానికి సపోర్ట్ గా నిలబడుతున్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. చిరంజీవి నుంచి విజయ్ దేవరకొండ వరకు.. ఈ విషయంలో సమంతకు సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సైతం తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ  ట్వీట్ చేశాడు.

Advertisement

“రాజకీయంలో వ్యక్తిగత విమర్శలు సర్వసాధారణమైపోయాయి , ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ గారు , నిన్నటి రోజున రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తూ ఒక ప్రఖ్యాత కథానాయకి పేరును ఉపయోగించడం, ఓ ప్రఖ్యాత సినిమా కుటుంబ వ్యహారాలను ఉటంకించి, మీడియా ముఖంగా మాట్లాడడం , వారికి రాజకీయంగా ఎంత లబ్ధి చేకూరుతుందో తెలియదు కానీ ఓ మహిళ ఆత్మాభిమానం, ఓ కుటుంబం పరువు, ప్రతుష్టలకు తీరని నష్టం, అన్యాయం జరిగింది.

గౌరవనీయులైన మంత్రివర్యులకు, రాజకీయ విమర్శలకు, ఏ మాత్రం సంబంధం లేని, తెరమీద తప్ప జీవితంలో నటించలేని సున్నితమనస్కులైన సినీనటులను బలిచేయవద్దని, జరిగిన తొందరపాటు చర్యను, విజ్ఞులైనమీరు పెద్దమనసుతో సరిదిద్దే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ , భవిషత్తులో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటారని వినమ్రంగా విన్నవించుకుంటూ.. మీ సాయి ధరమ్ తేజ్” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×