E-Paper
Advertisement

SDT18: హనుమాన్ నిర్మాతలతో మెగా మేనల్లుడు.. ఇక అధికారికం

SDT18: హనుమాన్ నిర్మాతలతో మెగా మేనల్లుడు.. ఇక అధికారికం
Advertisement

SDT18: విరూపాక్ష సినిమా తరువాత మెగా మేనల్లుడు మళ్లీ బ్రో సినిమాతో వెండితెరపై కనిపించాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది. ఇక మధ్యలో సత్య అనే ఒక ఆల్బమ్ లో కనిపించిన తేజ్.. ఆ తరువాత ఎక్కువ పవన్ పక్కనే కనిపించాడు. జనసేన తరుపున ప్రచార చేసి ఎట్టకేలకు మామయ్యను దగ్గరుండి గెలిపించాడు. ఇక ఆయన విజయాన్ని తన విజయంగా మార్చుకొని సంబురాలు చేసుకున్నాడు.

ఇక బ్రో తరువాత తేజ్.. సంపత్ నందితో గాంజా శంకర్ సినిమాను ప్రకటించాడు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే కొన్ని కారణాల వలన ఆగిపోయింది. ఇకపోతే గత కొన్నిరోజులుగా తేజ్.. కొత్త దర్శకుడితో ఒక సినిమా చేయబోతున్నాడని, దానికి హనుమాన్ సినిమా నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి అని టాక్ నడుస్తున్న నేపథ్యంలో తేజ్.. తన సినిమాను అధికారికంగా ప్రకటించాడు.

Advertisement

రోహిత్ కేపీ అనే దర్శకుడును పరిచయం చేస్తూ ప్రైమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హనుమాన్ నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని తేజ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ” నా తదుపరి చిత్రం SDT18. ఇది ప్రత్యేకంగా ఉంటుంది. మీ అందరి ప్రేమ & ఆశీస్సులు కావాలి” అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఒక పోస్టర్ ను కూడా అభిమానులతో పంచుకున్నాడు.

ఆ పోస్టర్ లో చుట్టూ ల్యాండ్ మైన్స్ ఉన్న ఎడారి ప్రాంతంలో ఒక చెట్టు పచ్చగా కనిపిస్తూ ఉంది. దీనంగా ఉన్న భూమి అతని రాక కోసం ఎదురుచూస్తుంది.. అతడు లోతుల నుంచి పైకి ఎక్కుతాడు అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాతో తేజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×