BigTV English

Sai Pallavi : ఆ హీరోలు అందరూ ఉనికిని కోల్పోతారు… సాయి పల్లవి నుంచి షాకింగ్ కామెంట్స్..!

Sai Pallavi : ఆ హీరోలు అందరూ ఉనికిని కోల్పోతారు… సాయి పల్లవి నుంచి షాకింగ్ కామెంట్స్..!

Sai Pallavi : సహజత్వానికే కాదు సింప్లిసిటీకి కూడా మారు పేరు అని మరోసారి నిరూపించింది లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi). మనల్ని ఎక్కువ పబ్లిసిటీ చేస్తే ప్రజలలో విసుగు వచ్చి, మనల్ని చూడడం మానేస్తారు. తర్వాత మన ఉనికినే కోల్పోవాల్సి వస్తుంది అంటూ ఊహించని కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి సాయి పల్లవి ఏ ఉద్దేశంతో ఇలాంటి కామెంట్స్ చేసిందో అనే విషయం ఇప్పుడు చూద్దాం…


ప్రతిభ ఉంటే చాలు పబ్లిసిటీ అవసరం లేదు…

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, మొదటి సినిమాతోనే తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో, నృత్య ప్రదర్శనలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది సాయి పల్లవి. వాస్తవానికి కేరళకు చెందిన అమ్మాయి అయినా తెలుగు ప్రేక్షకులు ఈమెను బాగా ఓన్ చేసుకున్నారు. దీనికి కారణం ఈమె సింప్లిసిటీ అని చెప్పాలి. గ్లామర్ ప్రపంచంలో అందాలు ఒలకబోస్తే తప్ప అవకాశాలు రావు అని భ్రమ పడే వాళ్ళందరి ఆలోచనలను తిప్పికొట్టింది. అందులో భాగంగానే ఒకప్పుడు మహానటి సావిత్రి , ఆ తర్వాత జనరేషన్ లో సౌందర్య, ఇప్పుడు సాయి పల్లవి అన్నట్టుగా మారిపోయారు. ఒక్కో జనరేషన్ కి ఒక్కొక్కరు అన్నట్టుగా.. ఈ జనరేషన్ లో సాయి పల్లవి గ్లామర్ షోకి దూరంగా ఉంటూ.. తన అంద చందాలతో కట్టు బొట్టుతో నిండు తనంతో ఉట్టిపడుతూ అందరిని ఆకట్టుకుంటుంది.


బాలీవుడ్ లో కి అడుగుపెట్టిన సాయి పల్లవి…

ఒకవైపు తెలుగు, మరొకవైపు తమిళ్ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న సాయి పల్లవి ఇటీవలే బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అక్కడ హిందీ రామాయణంలో సీత క్యారెక్టర్ చేస్తోంది. రామాయణం చిత్రంలో సీతగా అవకాశాన్ని దక్కించుకుంది. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభం అవ్వగా ఈమె పాత్రకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా చిత్ర బృందం రివీల్ చేసి సినిమాపై బజ్ పెంచేశారు.

ఇకపోతే ఒక సినిమాకి అయినా, ఒక సెలబ్రిటీకి అయినా ఇమేజ్ రావాలి అంటే కచ్చితంగా పీ.ఆర్ టీమ్ ఉండాల్సిందే. సెలబ్రిటీలు పెద్దగా కష్టపడకపోయినా ఆ టీం ఉంటే వారే వీరిని పాపులారిటీ చేస్తూ ఉంటారు. ఇప్పటికే మహేష్ బాబు (Mahesh Babu), అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్ (Ram Charan) లాంటి వాళ్లకు ప్రత్యేకమైన పిఆర్ టీంలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వీరందరికీ కౌంటర్ ఇస్తూ ఒక షాకింగ్ కామెంట్ చేసింది సాయి పల్లవి.

పబ్లిసిటీ పై స్టార్ హీరోలకు సాయి పల్లవి గట్టి కౌంటర్..

తాజాగా సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు.. ఇక్కడ మీకు మార్కెట్ లేదు కదా.. పీ.ఆర్ టీమ్ ని పెట్టుకుంటే మీ పాపులారిటీ మరింత పెరుగుతుంది కదా..? అని ఒక విలేకరు ప్రశ్నించగా..దానికి సాయి పల్లవి మాట్లాడుతూ.. క్లారిటీ వల్ల పబ్లిసిటీ పెరుగుతుంది. అయితే ప్రతిసారి మన గురించే భజన చేయడం వల్ల ప్రజలలో మనపై విసుగు వస్తుంది. తద్వారా మనల్ని చూడడం మానేస్తారు. ఫలితంగా మనం ఉనికిని కోల్పోతాము.. అది నాకు ఇష్టం లేదు అంటూ తెలిపింది సాయి పల్లవి. మొత్తానికైతే తన టాలెంట్ తోనే తాను ప్రజలలోకి వెళ్ళాలి అని, తనకు ఎలాంటి పబ్లిసిటీ అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ఏది ఏమైనా సాయి పల్లవి చేసిన కామెంట్లు స్టార్ హీరోలకు గట్టిగా కౌంటర్ ఇచ్చినట్లు అయింది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×