BigTV English

Salaar : ఈ రెండు థియేటర్లపై నిషేధం .. తగ్గేదే లేదంటున్న సలార్ బృందం..

Salaar : ఈ రెండు థియేటర్లపై  నిషేధం .. తగ్గేదే లేదంటున్న సలార్ బృందం..
Salaar movie latest news

Salaar movie latest news(Today tollywood news):

ప్రస్తుతం ఎక్కడ చూసినా సలార్ ఫీవర్ బాగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో థియేటర్లలో ఈ చిత్రం సందడి జోరుగా మొదలు కాబోతోంది. కానీ ఒక్క మల్టీప్లెక్స్ సంస్థకు మాత్రం సలార్ చిత్రం ప్రదర్శించే అవకాశం లేదు. సలార్ రిలీజ్ విషయంలో ఆ సంస్థ చేసిన అవకతవకలు కారణంగా చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ మల్టీప్లెక్స్ సంస్థ ఏదో తెలుసా.. ప్రఖ్యాత మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ ఐనాక్స్. ఈ మేరకు హోంబలే ప్రొడక్షన్ అధినేత కిరంగ‌దూర్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది.


సలార్ చిత్రం షారుక్ డంకీ మూవీ తో పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ రెండు చిత్రాలు 50-50 శాతం ప్రతిపాదికన థియేటర్లను పంచుకోవాలి అని ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నిర్ణయానికి పీవీఆర్ కూడా తన ఆమోదాన్ని తెలియపరచింది .కానీ ఉత్తరాదిన డంకీ కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిన పీవీఆర్ సంస్థ సలార్ కు అన్యాయం చేసింది. చాలా ప్రదేశాలలో నియమాన్ని ఉల్లంఘించి కేవలం షారుక్ డంకీ చిత్రాన్ని మాత్రమే రిలీజ్ చేస్తున్నారు.

అలాగే మరో పక్క మిరాజ్ సినిమాస్ తో కూడా సలార్ బృందం ఇదే రకమైన సమస్యలు ఎదుర్కుంది. ఈ నేపథ్యంలో పీవీఆర్ ఐనాక్స్ – మిరాజ్ సినిమాస్ రెండిటినీ.. దక్షిణాదిన నిషేధిస్తున్నట్లుగా సలార్ మూవీ మేకర్స్..హోంబ‌లే బ్యాన‌ర్ అధినేత‌లు తెలిపారు. నిజానికి మొదట అనుకున్నట్టుగా 50 – 50 ప్రతిపాదిక చొప్పున స్క్రీన్లు షేరింగ్ చేసుకోవడానికి సలార్ నిర్మాతలు ఎంతో న్యాయబద్ధంగా మంతనాలు సాగించారు. ఇదే విషయంపై చర్చించడం కోసం షారూక్ ని కూడా కలిసి మాట్లాడారు.


అయితే పీవీఆర్ ఐనాక్స్ ,మిరాజ్ సినిమాస్ మాత్రం ముందుగా అనుకున్న పద్ధతిని అనుసరించడంలో తడబడ్డారు. దీనితో హర్ట్ అయిన హోంబ‌లే అధినేత‌లు కేవలం ఉత్తరాదిన మాత్రమే కాకుండా దక్షిణాదిన కూడా ఈ రెండు సంస్థల థియేటర్లలో  సలార్ మూవీ ని ఆడించలేమని ప్రకటించారు. ఇలాంటి అవకతవక అన్ ఫెయిల్యూర్ ప్రాక్టీస్ చేయడం సరికాదు.. అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని సలార్ చిత్ర బృందం తెలియపరచింది.

అయితే ప్రస్తుతం మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం సలార్ ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉత్తరాదిన ఎక్కువ థియేటర్లు కలిగిన పీవీఆర్ స్క్రీన్ లపై సలార్ ఆడదు.. మరోపక్క దక్షిణాదిన 50 శాతం వరకు స్క్రీన్లు పీవీఆర్ సంస్థ ఆధీనంలో ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో పీవీఆర్ ఐనాక్స్ ని నిషేధించ‌డం సలార్ కలెక్షన్స్ పై ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. భారీ బజ్ ఉన్నప్పటికీ సరిపడా స్క్రీన్లు లేకపోతే అనుకున్న రేంజ్ కలెక్షన్స్ రావడం కష్టమే కదా.. ఈ నేపథ్యంలో సలార్ పై ఈ డెసిషన్ ప్రభావం ఎంతవరకు పడుతుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×