BigTV English

Arvind Kejriwal : ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా.. ఆ కార్యక్రమం కోసమేనా?

Arvind Kejriwal : ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా.. ఆ కార్యక్రమం కోసమేనా?
Arvind Kejriwal update news

Arvind Kejriwal update news(Telugu flash news):

ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణకు గైర్హాజరు అయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఈనెల 21న విచారణకు హాజరుకావాలని సోమవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే విపాసన ధ్యానం కోసం కేజ్రీవాల్ గుర్తుతెలియని ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం.


కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడం వెనుక అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మెడిటేషన్ కార్యక్రమం నేపథ్యంలోనే ఆయన హాజరు కాలేకపోయారని ఆప్ నేతలు అంటున్నారు. ఈ కార్యక్రమం నేటి నుంచి 10 రోజుల పాటూ ఉంటుందని ఆప్ ఎంపీ రాఘవ్‌ చద్దా చెప్పుకొచ్చారు. ఏటా విసాసన మెడిటేషన్ కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొంటారని ఆయన తెలిపారు. గతంలో కూడా బెంగళూరు, జైపూర్ వంటి నగరాల్లో ఈ కోర్సులో శిక్షణ పొందేందుకు సీఎం కేజ్రీవాల్ వెళ్లారని ఎంపీ గుర్తు చేశారు.

అయితే ఈ యోగా కార్యక్రమం ఈడీ నోటీసుల కంటే ముందుగానే నిర్ణయించినదని తెలిపారు. ఈడీ విచారణకు హాజరు కాకపోవడం వెనుక ఏవైనా చట్టపరమైన సమస్యలు తలెత్తితే న్యాయ స్థానాలను ఆశ్రయిస్తామని ఎంపీ రాఘవ్ చద్దా స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కేసులో గతంలో కూడా ఈడీ నోటీసులపై కేజ్రీవాల్ స్పందించలేదు.


Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×