
Salaar Trailer : టోటల్ ఇండియన్ సినీ లవర్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ సలార్. డార్లింగ్ ఫాన్స్ అయితే ఈ మూవీ ఎప్పుడు విడుదలవుతుందా అని ఎంతోఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ ఖాతాలో ఆ రెంజ్ హిట్ మరొకటి లేదు.. అందుకే ఈ చిత్రం పై డార్లింగ్ ఫాన్స్ ఆశలు పెట్టుకొని ఉన్నారు.
కే జి ఎఫ్ క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో మొదటి నుంచి ఈ చిత్రానికి హైప్ ఎక్కువగా ఉంది. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మోస్ట్ అవైలబుల్ చిత్రం సాలార్ ట్రైలర్ ను వచ్చేనెల అంటే డిసెంబర్ 1వ తారీఖున రాత్రి 7:19 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు మేకర్ పోస్టర్ రిలీజ్ చేసి తెలిపారు.
ట్రైలర్ రిలీజ్ టైం, డేట్ తెలియచేస్తూ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో ప్రభాస్ సీరియస్ గా ఒక జీపు పై నిలబడి చేతిలో గన్ పట్టుకొని మంచి ఫైటింగ్ మోడ్ లో కనిపిస్తున్నాడు. కటౌట్ చూస్తే కొన్ని నమ్మేయాలి డ్యూడ్.. అన్నట్టు ఈ పోస్టర్లో ప్రభాస్ కటౌట్ చూస్తే మూవీ ఎలా ఉంటుంది అన్న క్లారిటీ కచ్చితంగా వస్తుంది. ఈ పోస్ట్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ మూవీ ఎప్పుడు వస్తుందో అని ఆరాట పడిపోతున్నారు.
ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండడమే కాకుండా మైండ్ బ్లోయింగ్ యాక్షన్స్ అన్ని వేశాలు పక్కా అని క్లారిటీ ఇస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది.హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలను విజయ్ కిరగందుర్ నిర్వహిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి. డిసెంబర్ 22వ తారీఖున వరల్డ్ వైడ్ థియేటర్ ల పై సలార్ సునామీ లా దూసుకొస్తున్నాడు.