E-Paper
Advertisement

Sikandar film updates: సల్మాన్ మూవీ సికిందర్, కట్టప్పకు కీలక రోల్.. వచ్చే ఏడాది ఈద్‌కు..

Sikandar film updates: సల్మాన్ మూవీ సికిందర్, కట్టప్పకు కీలక రోల్.. వచ్చే ఏడాది ఈద్‌కు..
Advertisement

Salman’s Sikandar film updates: సల్మాన్‌ఖాన్- డైరెక్టర్ మురుగదాస్ కాంబోలో రానున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ సికిందర్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో హీరోయిన్ రష్మిక మందన్నా కాగా, బాహుబలి కట్టప్ప సత్యరాజ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది. సత్యరాజ్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కించాడు డైరెక్టర్ మురుగదాస్. అనుకున్న దానికంటే సన్నివేశాలు బాగా రావడంతో డైరెక్టర్ ఫుల్‌ఖుషీగా ఉన్నాడు. తొలి షెడ్యూల్‌లో సల్మాన్‌కు పార్ట్ పూర్తయ్యింది. ఆ సన్నివేశాల్లోనే కట్టప్ప కనిపించనున్నాడు.

Advertisement

ఈ ప్రాజెక్టుకు సంబంధించి సెకండ్ షెడ్యూల్ ఆగష్టు నుంచి మొదలుకానుంది. మేజర్ పార్ట్ అంతా యూరప్‌లో షూట్ చేయనున్నారు. దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ ఉండబోతోంది. లోకేషన్ రెడీ కావడంతో ఈ మంత్ ఎండింగ్‌ యూరప్‌కు వెళ్లాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Sikandar shooting satyaraj key role
Sikandar shooting satyaraj key role

సాజిద్ నడియావాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మరో నటుడు సునీల్‌శెట్టి క్రూషియల్ రోల్ చేయనున్నాడు. ఈ సినిమాపై అప్పుడే ఇండస్ట్రీలో మాంచి హైప్ క్రియేట్ అయ్యింది. లాంగ్ బ్రేక్ తర్వాత మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ప్రాజెక్టు ఇది. దాదాపు 400 కోట్ల రూపాయలతో దీన్ని తెరకెక్కిస్తున్నట్లు అంతర్గత సమాచారం.

Advertisement

అంతా అనుకున్నట్లు జరిగితే ఈద్ సందర్భంగా వచ్చే ఏడాది రిలీజ్ చేయాలన్నది మేకర్స్ చెబుతున్న మాట. సల్మాన్‌కు ఓ సెంటి‌మెంట్ ఉంది. తన సినిమాలను ఫెస్టివల్ సమయంలో రిలీజ్ చేస్తే హిట్ అవుతుందని నమ్మకం. అందుకే మేకర్స్ ఆ డేట్ ఫిక్స్ చేసినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: జక్కన్నపై డాక్యుమెంటరీ, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

టైగర్ 3 మూవీ తర్వాత సల్మాన్ ఏ ఫిల్మ్ చేయలేదు. అలాగే రష్మిక తొలిసారి స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. నార్మల్‌గా ఈ ప్రాజెక్టు చర్చలు మార్చిలో సల్మాన్‌తో జరిగాయి. ఆసక్తికరంగా ఉండడంతో వెంటనే పట్టాలకెక్కించాలని చెప్పాడట. మే చివరి నాటికి షూట్ మొదలుపెట్టాలని చెప్పడం, జూన్ నుంచి చిత్రీకరణ మొదలవ్వడం జరిగిపోయింది. రానున్న రోజుల్లో సికిందర్ గురించి ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×