BigTV English

Raj Tarun – Lavanya: రాజ్‌తరుణ్ – లావణ్యల ప్రేమ వ్యవహారం.. ఊహించని ట్విస్ట్..!

Raj Tarun – Lavanya: రాజ్‌తరుణ్ – లావణ్యల ప్రేమ వ్యవహారం.. ఊహించని ట్విస్ట్..!

Raj Tarun – Lavanya: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌కు నిన్న (జూలై 5)న అతడి ప్రియురాలు లావణ్య గట్టి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని.. పెళ్లి చేసుకోమని అడిగినందుకు తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గత 11 ఏళ్లుగా రాజ్ తరుణ్‌తో ప్రేమలో ఉన్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొంది.


ఇందులో భాగంగానే తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని.. అన్యాయంగా 45 రోజుల పాటు జైలు జీవితం గడిపానని లావణ్య తెలిపింది. అంతేకాకుండా రాజ్‌తరుణ్, తాను కలిసి గుడిలో పెళ్లి చేసుకున్నామని కూడా తెలిపింది. అంతేకాకుండా సినిమా హీరోయిన్ మాన్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్‌కి ఎఫైర్ ఉందని ఆ ఫిర్యాదులో రాసుకొచ్చింది.

ఆమె పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై రాజ్ తరుణ్ కూడా తన వైపు వెర్షన్ వినిపించాడు. ఇందులో భాగంగా ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశాడు. లావణ్యకు డ్రగ్స్ హ్యాబిట్ ఉండేదని.. ఎంత చెప్పినా వినేది కాదని మీడియా ముఖంగా తెలిపాడు. అంతేకాకుండా లావణ్యకు మస్తాన్ అనే అబ్బాయితో సంబంధం ఉందని కూడా పేర్కొన్నాడు. అలాగే తనను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ లావణ్యకు చెప్పలేదని.. ఆమెతో తనకు ఎలాంటి శారీరక సంబంధం లేదని తెలిపాడు.


Also Read: మస్తాన్ అనే వ్యక్తితో లావణ్యకు సంబంధం ఉంది: ప్రేయసి ఫిర్యాదుపై స్పందించిన రాజ్ తరుణ్

అంతేకాకుండా తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని లావణ్య అంటున్న మాటల్లో ఎలాంటి నిజం లేదని.. ఆమెను డ్రగ్స్ కేసులో ఇరికించే ఉద్దేశం ఉంటే.. తనకి ఇప్పుడీ పరిస్థితి ఉండేది కాదు కదా అని చెప్పుకొచ్చాడు. ఈ వ్యవహారాన్ని తాను లీగల్‌గానే ఎదుర్కుంటానని తెలిపాడు. ఇక ఇరువురి ఆరోపణలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. లావణ్య వెర్షన్ ఒకలా, రాజ్ తరుణ్ వెర్షన్ మరోలా ఉండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

అయితే లావణ్య ఫైల్ చేసిన కేసుపై పోలీసులు తాజాగా విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే నిన్న సాయంత్రం (జూలై 5) 91 CRPC కింద లావణ్యకు నార్సింగ్ పోలీసులు నోటీసులు పంపించారు. ఆ నోటీసుల ప్రకారం.. రాజ్ తరుణ్‌పై చేసిన ఫిర్యాదుకు సంబంధించి పూర్తి ఆధారాలను సమర్పించాలని లావణ్యకు ఇచ్చిన నోటీసులో తెలిపారు. అయితే అక్కడ వరకు సజావుగా సాగిన వ్యవహారం ఒక్కసారిగా ట్విస్ట్ ఇచ్చింది.

ఇవాళ మీడియా ముఖంగా అన్ని వివరాలు తెలియజేస్తానని చెప్పిన లావణ్య ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఆధారాలు సమర్పించమని నోటీసులు పంపించినప్పటి నుంచి లావణ్య అందుబాటులో లేదని సమాచారం. దీంతో ఈ వ్యవహారం మరింత వేడిక్కుతున్నట్లు కనిపిస్తోంది. ఇవాళ మీడియాతో అన్ని వివరాలు తెలియజేస్తానని చెప్పిన లావణ్య ఒక్కసారిగా అందుబాటులో లేకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. చూడాలి మరి ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×