BigTV English

BSP Chief Mayawati : బీఎస్పీ అధ్యక్షుడి హత్యపై మాయావతి ఆగ్రహం.. తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి

BSP Chief Mayawati : బీఎస్పీ అధ్యక్షుడి హత్యపై మాయావతి ఆగ్రహం.. తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి

BSP Chief Mayawati Calls for Peace(Latest telugu news): తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడి హత్యపై.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కె.ఆర్మ్ స్ట్రాంగ్ ను దారుణంగా నరికి చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే.. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని కార్యకర్తలకు సూచించారు. ఆర్మ్ స్ట్రాంగ్ కు నివాళులు అర్పించి.. అతని కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు ఆదివారం చెన్నైకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.


తమిళనాడులో బీఎస్పీ కోసం కష్టపడి పనిచేసే నాయకుడు, రాష్ట్ర పార్టీ యూనిట్ అధ్యక్షుడు కె. ఆర్మ్ స్ట్రాంగ్ ని శుక్రవారం సాయంత్రం చెన్నైలోని తన నివాసం వెలుపల దారుణంగా హత్యచేశారని ఆమె X వేదికగా ట్వీట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం తక్షణమే కఠినమైన చర్యలను తీసుకోవాలని, అప్పుడే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ట్వీట్ లో పేర్కొన్నారు.

Also Read : త్రిపురలో డేంజర్ బెల్స్, హెచ్ఐవీతో 47మంది మృతి.. 


ఆర్మ్ స్ట్రాంగ్ చెన్నై కార్పొరేషన్లో కౌన్సిలర్ గా పనిచేశారని, అతను దళితుల సమస్యలపై గొంతెత్తి పోరాడారని గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఆర్మ్ స్ట్రాంగ్ హత్యపై సీబీఐ దర్యాప్తు చేయించాలని బీఎస్పీ మద్దతుదారులు తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఆర్మ్ స్ట్రాంగ్ హత్యను ఆపడంలో విఫలమైన ఏడీజీపీని తొలగించాలని అతని మద్దతుదారులు డిమాండ్ చేశారు. ఆర్మ్ స్ట్రాంగ్ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. మరోవైపు ఆర్మ్ స్ట్రాంగ్ మృతిపట్ల తమిళనాడు సీఎం స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశారు. హత్యకు కారణమైన వారిని పోలీసులు గతరాత్రే అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×